గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

సరిలేరు నీకెవ్వరు Vs అలవైకుంఠపురంలో నైజాం బిజినెస్ తెలిస్తే షాక్!!

2020 సంక్రాంతి మూవీస్ కి రిలీజ్ కి ఇంకా రెండు నెలల సమయం మాత్రమె ఉంది, కాగా ఆ సినిమాలు ఇప్పటి నుండే రచ్చ లేపుతూ క్రేజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతుండటం విశేషం, ప్రస్తుతానికి రెండు పాటలను చిన్న సాంగ్స్ ప్రోమో లను రిలీజ్ చేసి అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో టీం ప్రమోషన్స్ లో రెండు మెట్లు ముందు ఉండగా మరొ పక్క సరిలేరు నీకెవ్వరు డైరెక్టర్ అనిల్ రావిపూడి…

ఎప్పటికప్పుడు షూటింగ్ అప్ డేట్స్ ని తన సోషల్ మీడియా అకౌంట్ లో తెలియజేస్తూ సినిమా ను వార్తల్లో నిలిచేలా చేస్తూ ప్రమోట్ చేస్తున్నాడు. ఇక రెండు సినిమాలకు బిజినెస్ పరంగా కూడా జోరు అందుకుందని తెలుస్తుంది, రీసెంట్ గా రెండు సినిమాల సీడెడ్ ఏరియా బిజినెస్ లు…

ఆల్ మోస్ట్ పూర్తీ అయినట్లు సమాచారం… అల వైకుంఠ పురంలో కి సీడెడ్ లో 12.06 కోట్ల వరకు బిజినెస్ జరగగా సరిలేరు నీకెవ్వరు సినిమా కి 10.8 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని సమాచారం, ఇక ఇప్పుడు రెండు సినిమాల నైజాం ఏరియా బిజినెస్ లు ఆల్ మోస్ట్ పూర్తీ అయ్యాయని టాక్ ఉంది.

అందులో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా కి 25 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని సమచారం. ఇక అల వైకుంఠ పురం లో సినిమా కి గాను 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని సమాచారం. ఇది అల్లు అర్జున్ కెరీర్ లో రికార్డ్ కాగా మహేష్ కెరీర్ లో కూడా…

వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ ని నైజాం ఏరియా లో అందుకోబోతుంది సరిలేరు నీకెవ్వరు సినిమా, సంక్రాంతి బరిలో రెండు పెద్ద మూవీస్ కి పోటి లో కూడా ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటం విశేషం అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి లో ఏ సినిమా ముందుగా టార్గెట్ ని అందుకుంటుందో సంక్రాంతి వరకు ఆగితే తెలుస్తుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!