న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

సరిలేరు నీకెవ్వరు Vs అల వైకుంఠ పురంలో గుంటూరు షాకింగ్ హైర్స్ రిపోర్ట్!!

సంక్రాంతి బరిలో నువ్వా నేనా అనిపించేలా రీసెంట్ టైం లో ఎప్పుడూ జరగనంత పోటి 2 సినిమాల మధ్య రిలీజ్ కి ముందే జరిగింది, మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురం లో సినిమాల మధ్య రిలీజ్ డేట్ నుండి సాంగ్స్, టీసర్ అండ్ ట్రైలర్ దాకా అన్నీ పోటా పోటీ గానే జరిగాయి. ఇక సినిమాలు కూడా ఒకేరోజు గ్యాప్ తో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి.

కాగా రెండు సినిమాలకు హైర్స్ కూడా దక్కుతున్నాయి. హైర్స్ అంటే “ఒక ఏరియా ని రౌండ్ ఫిగర్ కి కొంటారు…ఆ ఏరియాలో టికెట్ రేట్లు వాళ్ళ ఇష్టం(పర్మీషన్ ఉంటే)..ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది వాళ్ళకే. కానీ నిర్మాతలు ఆ అమౌంట్ ని సినిమా కి వచ్చిన డే 1/వీకెండ్/వీక్/ లైఫ్ టైం….కలెక్షన్స్ లో కలిపి వాటిని కూడా షేర్ కింద కౌంట్ చేస్తారు.”

వాటినే హైర్స్ అంటారు. ఇక ఈ రెండు సినిమాలకు గుంటూరు ఏరియా మాస్ సెంటర్స్ లో హైర్స్ కన్ఫాం అయ్యాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా కి 1.50 కోట్ల హైర్స్ అక్కడ కన్ఫాం కాగా అల వైకుంఠ పురం లో సినిమా కి 1 కోటి దాకా హైర్స్ అక్కడ కన్ఫాం అయ్యాయి.

అక్కడ ఒకసారి హైయెస్ట్ హైర్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని ఒకసారి గమనిస్తే
?#Baahubali2: 3.40Cr
?#SyeRaa: 2.89Cr
?#Saaho: 2.50Cr
?#Agnyathavaasi: 1.80Cr
?#VinayaVidheyaRama: 1.60Cr
?#AravindhaSametha: 1.60Cr
ఇవీ అక్కడ హైయెస్ట్ హైర్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు. ఇది వరకు మహేష్ మహర్షి కి అక్కడ 1.5 కోట్ల రేంజ్ లోనే హైర్స్ దక్కాయి.

మొత్తం మీద పోటి తీవ్రంగా ఉన్నా రెండు సినిమాల హైర్స్ ఈ ఒక్క ఏరియాలోనే 50 లక్షల తేడా ఉంది. ఇక మిగిలిన ఏరియాల హైర్స్ లెక్కలు తేలాల్సి ఉంది, ఒకవేళ హైర్స్ కొన్న బయ్యర్ డబ్బు చెల్లించడంలో విఫలం అయితే ఆ హైర్స్ కాన్సిల్ అవ్వడం కానీ వేరే వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి చెల్లె అవకాశం ఉంటుంది, దాంతో రిలీజ్ తర్వాత రోజు వరకు క్లియర్ గా ఎంత హైర్స్ వచ్చింది అన్నది చెప్పలేమ్. ఇక ఈ 2 సినిమాల ఇతర ఏరియాల హైర్స్ కన్ఫాం అయితే అప్ డేట్ చేస్తాం…

Leave a Comment