గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

సర్కారు వారి పాట-పుష్ప కోసం రికార్డ్ లెవల్ రేటు ఆఫర్ చేసిన స్టార్ మా!

ఈ ఇయర్ సంక్రాంతి బరిలో అల్టిమేట్ రికార్డులతో దుమ్ము దుమారం లేపిన సినిమాలు సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠ పురంలో…. సంక్రాంతి సీజన్ ని అంచనాలను మించి వాడుకుని టాలీవుడ్ చరిత్ర లో అల్టిమేట్ రికార్డులను నమోదు చేసిన ఈ రెండు సినిమాలు తర్వాత టెలివిజన్ లో కూడా సంచలనాలు సృష్టించగా… ముందుగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా… జెమినీ లో టెలికాస్ట్ అయినప్పుడు రికార్డులు క్రియేట్ చేసింది.

ఆల్ టైం హైయెస్ట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని రచ్చ రచ్చ చేయగా… తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో కొంచం లేట్ గా జెమినీ టీవీ లోనే టెలికాస్ట్ అయినా కానీ పాత TRP రికార్డులను అన్నీ బ్రేక్ చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది.

TRP ల పరంగా కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి పెట్టింది, ఇలా TRP ల విషయం లో కొత్త రికార్డులను సృష్టించిన ఈ రెండు సినిమాలను జెమినీ టీవీ సొంతం చేసుకోగా సినిమాల శాటిలైట్ రైట్స్ ని జస్ట్ లో మిస్ చేసుకున్న స్టార్ మా ఛానెల్ ఈ హీరోల అప్ కమింగ్ సినిమాల విషయం లో….

మాత్రం తగ్గేది లేదు అంటూ భారీ ఆఫర్లు అప్ కమింగ్ మూవీస్ ఇస్తుందట. ఇంకా కరెక్ట్ గా షూటింగ్ మొదలు కానీ మహేష్ సర్కారు వారి పాట అండ్ అల్లు అర్జున్ పుష్ప సినిమాల కోసం రికార్డ్ లెవల్ లో శాటిలైట్ రైట్స్ రేటు ని కోట్ చేసినట్లు సమాచారం. పెర్ఫెక్ట్ రేటు ఎంత అనేది క్లియర్ గా రివీల్ కాలేదు కానీ….

మొత్తం మీద రేటు 22 కోట్లకు పైగానే కోట్ చేశారని సమాచారం… కానీ రెండు సినిమాల యూనిట్ లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. అన్ని ఛానెల్స్ కొటేషన్స్ చూసి ఏది బెస్ట్ అనిపిస్తే ఆ ఆఫర్ ని ఓకే చేయాలనీ చూస్తున్నాయట. స్టార్ మా మాత్రం ఈ సారి మిస్ కాకూడదు అని గట్టి ప్రయత్నాలు చేస్తుందట.

Leave a Comment