న్యూస్ రివ్యూ

సల్మాన్ ఖాన్ రాధే రివ్యూ….పారిపొండిరోయ్…భారీ షాకిది!!

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రభుదేవా ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రాధే… మహేష్ బాబు పోకిరి హిందీ రీమేక్ వాంటెడ్ సినిమా కి సీక్వెల్ అంటూ రూపొందిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ రంజాన్ టైం లోనే ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ కి నోచుకోలేదు ఈ సినిమా. కానీ ఈ ఇయర్ రంజాన్ కి అనుకుంటే మళ్ళీ సెకెండ్ వేవ్ రావడం తో డిజిటల్ రిలీజ్ అయింది.

మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… కథ పాయింట్ కి వస్తే ముంబై సిటీ లో డ్రగ్స్ ఏకంగా స్కూల్స్ వరకు వచ్చి పిల్లలను బానిసగా చేస్తుంది, దీని వెనక ఎవరు ఉన్నారో పోలీసులు ఎవరూ కనిపెట్టలేక పోతారు. ఇలాంటి టైం లో తనదైన స్టైల్ లో…

కేసులను సాల్వ్ చేసే హీరో ని పిలిపించి కేసు అప్పగిస్తారు, హీరో ఈ సిటీ ని క్లీన్ చేస్తా అంటూ ఛాలెంజ్ చేస్తాడు. మరి ఎలా క్లీన్ చేశాడు అన్నది సినిమా కథ. ఇలాంటి కథలు మనం ఎన్ని చూడలేదు చెప్పండి.. మరి సల్మాన్ ఖాన్ కి ఈ కథ లో ఏం నచ్చిందో ఏమో డైరెక్టర్ ఏం చెబితే అది చేశాడు.

ఆ సీన్స్ ఎంత సిల్లీగా వస్తున్నాయి అని కూడా పట్టించుకోలేదు… విలన్స్ బ్యాక్ క్లైమాక్స్ లో ఎక్కడికో తీసుకు వెళుతూ పోలీసులే తప్పిస్తారు…వాళ్ళు బైక్స్ పై పారిపోతుంటే సల్మాన్ తన ఒక్కోక్కరిపై కారును ఎక్కిస్తాడు. అందరూ హెల్మెట్స్ తో కారు పై దాడి చేస్తారు. ఇక విలన్ రణదీప్ హుడా ఒక రాడ్ తో సల్మాన్ చేయి పై క్లైమాక్స్ లో బలం అంతా పెట్టి దాడి చేస్తాడు…

కానీ సల్మాన్ ఒక్క సారి కూడా దెబ్బ తగిలినట్లు చూపెట్టలేదు… కానీ రక్తం కారుతుంది… ఇలా హీరో ఎంట్రీ సీన్ నుండి ఎండ్ కార్డ్ వరకు కూడా అతి నాసిరకంగా సినిమా కొనసాగుతుంది.. సినిమా లెంత్ 1 గంటా 53 నిమిషాలు, టైటిల్స్ ఎండ్ కార్డ్స్ పక్కకు పెడితే.. 1 గంటా 45 నిమిషాలు.. అందులో 4 సాంగ్స్ ని పక్కకు పెడితే 1 గంటా 25 నిముషాలు. అంటే కేవలం 85 నిమిషాల…

లెంత్ ఉన్న టాకీ పార్ట్ ఎంత రేసీగా ఉండాలో అంత రేసీగానే ఉన్నా ఆ సీన్స్ అంత సిల్లీగా లౌడ్ గా ఉండటం తో చూస్తున్నప్పుడు భజరంగీ భాయిజాన్, సుల్తాన్, ఏక్తా టైగర్ లాంటి సినిమాలు తీసిన సల్మానే నా ఈ సినిమాలు తీస్తుంది అనిపించే విధంగా భాద కలగడం ఖాయం…

ఇక హీరోయిన్ దిశా పటానీ ని ఎందుకు పెట్టుకున్నారో ఆ విధంగా న్యాయం చేసినా పెర్ఫార్మెన్స్ జీరో… జాకీ ష్రాఫ్ పర్వాలేదు, రణదీప్ హుడా విలనిజం ఒక్కటే ఎంతో కొంత మెప్పిస్తుంది. ఇక సంగీతం పర్వాలేదు కానీ సీటి మార్ చూస్తుంటే మన సీటి మారే గుర్తుకు రావడం ఖాయం….

ఇక ప్రభుదేవా డైరెక్షన్ కంప్లీట్ గా అవుట్ డేటెడ్ అయిపొయింది అని మరోసారి నిరూపించిన సినిమా ఇది… ఈ పాటి సినిమా కి ఇన్ని రోజులు హోల్డ్ లో పెట్టారా అనిపిస్తుంది మొత్తం మీద సినిమా చూశాక… ఓవరాల్ గా రొటీన్ రొట్ట కొట్టుడు కమర్షియల్ మూవీ రాధే…. ఎంత ఫ్రీ టైం ఉన్నా 2 గంటలు అతి కష్టం మీద సినిమా ను కంప్లీట్ చేయాల్సి వస్తుంది…

Leave a Comment