న్యూస్ స్పెషల్

సల్మాన్ 16…అక్షయ్ 15…ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఇదో చారిత్రిక రికార్డ్!!

ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఇదో చారిత్రిక రికార్డ్ గా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ అందుకోవడం ఒకప్పుడు కష్టంగా మారినా తర్వాత అది కామన్ గా మారి బాలీవుడ్ హీరోలు ఈ రికార్డ్ కలెక్షన్స్ తో మెంటల్ మాస్ చూపిస్తున్నారు… ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర నువ్వా నేనా అనేంతగా ఈ 100 కోట్ల రేసు లో దూసుకు పోతూ కొత్త రికార్డులను నమోదు చేస్తున్నారు.

వారే బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్ లు… వీరు నటించిన సినిమాలు ఎక్కువ గా 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని మినిమం అందుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశాయి. ఇక్కడ సల్మాన్ ఖాన్…..

16 సార్లు నాన్ స్టాప్ గా ఒక్క సారి కూడా బ్రేక్ చేయకుండా ఈ రికార్డ్ ను అందుకోగా…అక్షయ్ కుమార్ నటించిన సినిమా లు మధ్యలో కొన్ని బ్రేక్స్ పడ్డా ఓవరాల్ గా రీసెంట్ గా సూపర్ ఫాం లో ఉండటం తో 15 సార్లు 100 కోట్ల సినిమాలను అందుకుని రికార్డ్ సృష్టించాడు.

ముందుగా సల్మాన్ ఖాన్ 100 కోట్ల సినిమాల లిస్టు ను గమనిస్తే…రెడీ, బాిడీగార్డ్, కిక్, జైహో, ఏక్ థా టైగర్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, దబంగ్-2, భజరంగి భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, టైగర్ జిందా హై, రేస్-3, భారత్, దబంగ్ 3 వరకు నాన్ స్టాప్ గా 100 కోట్ల మార్క్ ని కంటిన్యుగా అందుకోగా డిజిటల్ రిలీజ్ అయిన రాధే కూడా టికెట్ రేట్లు సాలిడ్ గా అమ్ముడు పోయి రికార్డ్ కలెక్షన్స్ తో మరో 100 కోట్ల సినిమాగా నిలిచి సల్మాన్ లెక్క ని 16 కి చేరేలా చేసింది.

ఇక అక్షయ్ కుమార్ ఓవరాల్ 100 కోట్ల మూవీస్ ని గమనిస్తే… హాలిడే, రౌడీ రాథోడ్, హౌస్ ఫుల్ 2, హౌస్ ఫుల్ 3, గోల్డ్, ఎయిర్ లిఫ్ట్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, జోలీ LLB 2, రుస్తుం, 2.0(హిందీ), కేసరి, హౌస్ ఫుల్ 4, గుడ్ న్యూజ్ మరియు మిషిన్ మంగళ్ సినిమాలు 100 కోట్ల మార్క్ ని అందుకున్నాయి, కేవలం హీరో రోల్స్ నే చూసుకున్నా 13 సినిమాలతో టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకున్నాడు అక్షయ్… ఇక లాస్ట్ ఇయర్ లక్ష్మీ డిజిటల్ లో సెన్సేషనల్ వ్యూస్ ని సాధించి డిజిటల్ లో రికార్డ్ కొట్టింది, ఆ సినిమా కూడా కలుపుకుంటే లెక్క 15 కి వెళుతుంది అని చెప్పాలి. మరే హీరో కూడా వీళ్ళకి పోటిగా లేడంటే వీళ్ళ జోరు అర్ధం చేసుకోవచ్చు…

Leave a Comment