న్యూస్ బాక్స్ ఆఫీస్

సాహో@డే 12….మళ్ళీ షాక్ ఇచ్చాడు!!

2019 మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఒకటైన సాహో రిలీజ్ కి ముందు ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా రిలీజ్ అయిన తర్వాత సినిమా కి ఆ రేంజ్ టాక్ అయితే రాలేదు, కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ కి అతీతంగా మొదటి 4 రోజుల్లో అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించగా తర్వాత స్లో డౌన్ అయినప్పటికీ ఎలాగోలా లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతూ 11 రోజుల్లో 200 కోట్ల మైలురాయి ని అధిగమించింది.

ఇక సినిమా 11 వ రోజు వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన స్లో అవ్వగా తిరిగి 12 వ రోజున మొహర్రం హాలిడే ఉండటం తో తిరిగి కొద్దిగా తేరుకుని 11 వ రోజు తో పోల్చితే అన్ని చోట్లా కొంచం బెటర్ కలెక్షన్స్ తో ట్రేడ్ ఇక క్లోజ్ అవుతుంది అనుకుంటే మళ్ళీ షాక్ ఇచ్చి…

సినిమా రన్ ఇంకా అయిపోలేదు అనే సంకేతాలు ఇచ్చింది, రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 11 వ రోజు తో పోల్చితే మంచి కలెక్షన్స్ ని సాధించిందని సమాచారం, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా 12 వ రోజు 70 లక్షల నుండి 75 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చట.

ఇక సినిమా హిందీ వర్షన్ ఈ రోజు 3 కోట్లకు రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక మిగిలిన చోట్లా మరియు ఓవర్సీస్ లో కలిపి మరో 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. మొత్తం మీద 12 వ రోజున వరల్డ్ వైడ్ గా సాహో సినిమా..

2.6 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి, ఇది 11 వ రోజు తో పోల్చితే మంచి హోల్డ్ అనే చెప్పాలి, కానీ సేఫ్ అవ్వాలి అంటే ఇది సరిపోదు కానీ సినిమా కి వచ్చిన రివ్యూలకు ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతుండటం తో గొప్పే అని చెప్పి తీరాల్సిందే.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!