న్యూస్ బాక్స్ ఆఫీస్

సాహో కలెక్షన్స్: అమ్మింది 270.6 కోట్లు…2 వారాల్లో వచ్చింది ఇది…పాపం!!

సాహో బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఊహాతీతంగా మారింది, సినిమా కి టాక్ అనుకున్న విధంగా రాకున్నా కానీ అల్టిమేట్ కలెక్షన్స్ తో తొలి 4 రోజుల్లో సాలిడ్ రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా తర్వాత స్లో డౌన్ అవ్వగా రెండో వారం వర్కింగ్ డేస్ లో సినిమా మరింత స్లో డౌన్ అయ్యింది, 13 వ రోజు డెఫిసిట్ లు పడగా 14 వ రోజు 3% గ్రోత్ ని చూపెట్టే కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించింది.

సినిమా 14 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam – 4L
Ceded – 4.2L
UA – 3L
East – 2L
West – 1.4L
Guntur – 2L
Krishna – 1.4L
Nellore – 3L
14th day: 21L….. 13 వ రోజు 18 లక్షలు రాగా 14 వరోజు 3 లక్షలు అధికంగా వసూల్ చేసింది.

ఇక 2 వారాలకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాహో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
Nizam – 29.11Cr
Ceeded – 11.63Cr
UA – 9.91cr
East – 7.13Cr
West – 5.83Cr
Guntur – 7.85cr
Krishna – 5.18cr
Nellore – 4.31Cr
14 Days Total –80.95Cr
Karnataka – 15.94Cr
Tamil – 5.20Cr
Kerala – 1.41Cr
Hindi& ROI- 78.40Cr
USA/Can- 13Cr
ROW – 17.10Cr
14 Days Total –212Cr

కాగా టోటల్ గ్రాస్ ట్రేడ్ లెక్కల్లో 395 కోట్ల వరకు ఉండగా నిర్మాతల లెక్కల్లో గ్రాస్ 417 కోట్లకు పైగా ఉందని సమాచారం. ఇక సినిమాను మొత్తం మీద 270.6 కోట్లకు అమ్మగా 272 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా…మరో…

60 కోట్ల షేర్ ని సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది దాదాపు అసాధ్యం అని చెప్పాలి, హిందీ లో 60 కోట్ల బిజినెస్ కి 78.4 కోట్ల షేర్ తో సూపర్ హిట్ అనిపించుకున్న సినిమా మిగిలిన అన్ని చోట్లా మాత్రం నష్టాలనే సొంతం చేసుకుంది. అయినా సినిమా కి ఫస్ట్ డే వచ్చిన టాక్ కి ఇంతవరకు రావడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!