Home న్యూస్ సాహో టాప్ 5 బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్!!

సాహో టాప్ 5 బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్!!

12
0

2019 వన్ ఆఫ్ మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో ప్రేక్షకుల ముందుకు రీసెంట్ గా రాగా సినిమా ప్రేక్షకుల ను అల రిస్తూ అద్బుతమైన వసూళ్ళ ని మొదటి వీకెండ్ లో సాధిస్తూ దూసుకు పోతుంది, ఇక సినిమా టాప్ 5 బిగ్గెస్ గూస్ బంప్స్ సీన్స్ అండ్ ప్లస్ పాయింట్స్ ని రీసెంట్ గా అప్ డేట్ చేశాం…. ఇక సినిమా టాప్ 5 బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ ఏంటి అనేవి తెలుసు కుందాం పదండీ..

ఫస్ట్ మైనస్ పాయింట్…. ప్రభాస్ ఇంట్రో నే… ఎలాంటి నేమ్ కార్డ్ లేకుండా సింపుల్ గా నడుచుకుంటూ వచ్చేస్తూ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఇంట్రో సీన్ తీయడం లో డైరెక్టర్ సుజీత్ ఫెయిల్ అయ్యాడు, అది ఫస్ట్ మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇక రెండో మైనస్ పాయింట్….

సంగీతం… ఒకరికి మించిన మ్యూజిక్ డైరెక్టర్స్ ని పెట్టుకున్న ఎవ్వరి నుండి సరైన మ్యూజిక్ ని సొంతం చేసుకోలేదు. ఆల్బం లో హిట్ అయిన సయ్యా సైకో పాట కూడా పిక్చరైజేషన్ చాలా వీక్ గా ఉంది, ఇక మిగిలిన పాటలు అయితే తియేటర్ బయటికి వచ్చాక ఎవరికీ గుర్తు కూడా ఉండవు.

ఇక మూడో మైనస్ పాయింట్ సినిమా లెంత్…. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పెర్ఫెక్ట్ గా ఉంటే సినిమా లెంత్ 2 గంటల 20 నిమిషాల రేంజ్ లో ఉండాల్సింది. అప్పుడు టాక్ గురించి అస్సలు పట్టించుకునే వారే కాదు బయట. సినిమాలో అనేక సీన్స్ అనవసరం అని చెప్పొచ్చు. హీరో ఇంట్రో సీన్ లోనే నిప్పుకోడి, బ్లాక్ పాంథర్, త్రాచు పాము లాంటి అనవసరపు షాట్స్… లవ్ స్టొరీ ని సెకెండ్ ఆఫ్ ని చాలా డ్రాగ్ చేసిన సీన్స్ ఉన్నాయి. ఇవి తగ్గించి ఉంటె టాక్ చాలా బాగా వచ్చి ఉండేది.

ఇక నాలుగో మైనస్ పాయింట్ గ్రాఫిక్స్….చిన్న సినిమా అంటే పరిమితులతో తీస్తారు కాబట్టి గ్రాఫిక్స్ బాగా లేకపోయినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకుని ఉండరు, కానీ 350 కోట్ల బడ్జెట్ తో తీశాం అని చెప్పుకున్న సాహో లో ఫైట్ సీన్స్ అండ్ చేజింగ్ సీన్స్ లో గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. దాంతో చాలా మంది వాటినే మేజర్ గా పాయింట్ అవుట్ చేశారు.

ఇక చివరగా డైరెక్షన్ 5 వ మైనస్ పాయింట్ గా చెప్పుకోవాలి… అసలు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుండి ఆడియన్స్ కోరుకునేది… అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అండ్ హీరోయిజం అడుగడుగనా ఉన్న సీన్స్… వీటిలో యాక్షన్ సీన్స్ పెట్టినా అవి చేజింగ్ కే పరిమితం చేసిన సుజీత్ హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ అసలు ఒకటి 2 చోట్ల అవకాశం ఉన్నా కానీ పెట్టలేదు.

ఒక ఉదాహరణకు సెకెండ్ ఆఫ్ లో హీరోయిన్ హెలికాప్టర్ నుండి పడే సీన్ లో తనని కాపడానికి హీరో జెట్ ని తొడుక్కుని కిందకి దూకుతాడు… బ్యాగ్రౌండ్ స్కోర్ కి థియేటర్స్ షేక్ అవుతున్న సమయంలో సడెన్ గా ఆ జెట్ ఆగిపోతుంది. దాంతో ఒక్కసారి అందరు నీరుగారిపోతారు.

ఇలా డైరెక్టర్ గా సుజీత్ సినిమా బడ్జెట్ ని పెంచడమే కాకుండా ఫ్యాన్స్ ని కూడా ప్రభాస్ విషయం లో సాటిస్ ఫై చేయలేక పోయాడు. ఇవి మొత్తం మీద సినిమా కి మేజర్ మైనస్ పాయింట్స్ గా నిలిచిన అంశాలు.. మీరు ఏవైనా నోట్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here