న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

సాహో ట్రైలర్ రికార్డ్స్: 24 గంటలు ఓవర్…రికార్డ్ ముక్క మిగ్గలేదు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండేళ్ళకి పైగా టైం తీసుకుని నటించిన లేటెస్ట్ మూవీ సాహో అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది, కాగా తొలి 24 గంటలు ముగిసే సమయానికి టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసి సరికొత్త రికార్డులను నమోదు చేసింది, బాహుబలి ట్రైలర్ ని పక్కకు పెడితే సాహో ట్రైలర్ రికార్డులు ఊచకోత అంతా ఇంతా కాదనే చెప్పాలి. కొత్త బెంచ్ మార్కుల తో దుమ్ము లేపుతూ 12.33 మిలియన్ వ్యూస్ ని 392K లైక్స్ ని అందుకుంది.

తెలుగు సినిమా చరిత్రలో హైయెస్ట్ వ్యూస్ ని తొలి 24 గంటల్లో సాధించిన టాప్ ట్రైలర్స్ ని ఒకసారి గమనిస్తే..
#Baahubali2: 21.81M
#SaahoTrailer: 12.32Mil
#Maharshi: 7.31M
#AravindaSametha : 7.8 M(2 Channels)(1Channel : 6.98M)
#NaaNuvve-6.97M
#VinayaVidheyaRama: 6.57 M
#Agnyaathavaasi – 6.2M….నాన్ బాహుబలి రికార్డ్ ను ఏకంగా 5 మిలియన్ వ్యూస్ లీడ్ తో సాహో సొంతం చేసుకుంది…

ఇక హైయెస్ట్ లైక్స్ ని తొలి 24 గంటల్లో అందుకున్న తెలుగు సినిమా ట్రైలర్స్ ని గమనిస్తే…
#Baahubali2(2017): 544k Likes
#SaahoTrailer(2019): 393K Likes
#AravindaSametha(2018) : 327k Likes
#Agnyaathavaasi(2018): 272k Likes
#VinayaVidheyaRama(2019): 238k Likes
#DearComrade(2019): 233K Likes
#Maharshi(2019): 197K Likes…. ఇక్కడ ఆల్ మోస్ట్ 65 వేల కి పైగా లీడింగ్ తో లైక్స్ రికార్డ్ ను అందుకుంది.

కాగా సినిమా ట్రైలర్ హిందీ లో 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని తమిళ్ లో 4.5 మిలియన్ కి పైగా వ్యూస్ ని ఇలా అన్ని చోట్లా రికార్డులు నమోదు చేస్తూ సినిమా పై ఉన్న క్రేజ్ ని చాటి చెబుతూ ఓవరాల్ గా 50 మిలియన్ కి పైగా వ్యూస్ ని అన్ని చోట్లా కలిపి సొంతం చేసుకుంది.

ఇది కేవలం అప్ డేటెడ్ వ్యూస్ మాత్రమె… యూట్యూబ్ రియల్ టైం వ్యూస్ అంతకుమించి ఉంటాయి. ఎలాంటి ప్రమోషన్ పనులు లాంటివి లేకుండానే ఆల్ టైం రికార్డులతో దుమ్ము దుమారం చేసిన సాహో ఆగస్ట్ 30 న ఇప్పుడు ఎలాంటి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!