గాసిప్స్ న్యూస్

సినిమా డిసాస్టర్….మోహన్ బాబు పై అప్పు భారం…ఎంత అప్పు ఉందంటే!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల రిజల్ట్ ను ఊహించలేం, కొన్ని సినిమాలు హిట్ అవుతాయి అనుకున్నవి ఫ్లాఫ్ అవుతాయి, కొన్ని ఫ్లాఫ్ అవుతాయి అనుకున్నవి హిట్ అవుతాయి. కానీ సినిమాలు రిలీజ్ అవ్వడమే ఎక్కడో తేడా కొడుతుందే అని అనిపిస్తూ ఉంటాయి, అలాంటి కోవలోకే వచ్చే సినిమా మంచు విష్ణు కాజల్ అగర్వాల్ ల కాంబినేషన్ లో రూపొందిన మోసగాళ్ళు సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా..

ఆడియన్స్ ను మినిమమ్ కూడా థియేటర్స్ కి రప్పించలేక పోయింది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ కాదు ఎపిక్ ఇండియన్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 50 కోట్ల రేంజ్ లో అయ్యిందని మంచు విష్ణు స్వయంగా చెప్పుకొచ్చారు.

కాగా ఈ అమౌంట్ లో తన స్వంత డబ్బు తో పాటు ఫైనాన్స్ డబ్బులు కూడా భారీగా ఉన్నాయట. బడ్జెట్ ఎక్కువైతే ఎక్కువ శాతం ఫైనాన్స్ డబ్బులతోనే సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. కాగా ఈ సినిమా కి ఫైనాన్స్ రూపంలో ఏకంగా 20 కోట్లకు పైగానే ఫైనాన్స్ ను తీసుకున్నాడట మంచు విష్ణు…

తను పెట్టిన మిగిలిన బడ్జెట్ కి సినిమా ఓవరాల్ గా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కింద ఎంతో కొంత రికవరీ చేసినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఆడితే ఫైనాన్స్ డబ్బులు రిటర్న్ ఇవ్వొచ్చు అనుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం తో ఇక చేసేదేమీ లేక మంచు మోహన్ బాబు దగ్గరకి వెళ్ళాల్సి వచ్చిందని టాక్ ఉంది.

మోహన్ బాబు విష్ణు ఫైనాన్స్ క్లియర్ చేయడానికి 15 కోట్లకు పైగానే సాయం చేశారని టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది, అది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా మొత్తం మీద ఓవర్ బడ్జెట్ వల్ల మరోసారి మంచు విష్ణు ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చింది, బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాఫ్ ను సొంతం చేసుకోవాల్సి వచ్చింది.

Leave a Comment