గాసిప్స్ న్యూస్

సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు…మరో ఏడాది నో మూవీ…డైలమాలో డైరెక్టర్!!

  చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్స్ లో శ్రీకాంత్ అడ్డాల కూడా ఒకరు. 2008 లో టాలీవుడ్ లో కొత్త బంగారు లోకం సినిమా తో ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల 5 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో అంతరించి పోయిన మల్టీ స్టారర్ కల్చర్ ని మళ్ళీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో మొదలు పెట్టి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు…

కానీ తర్వాత చేసిన ముకుంద సినిమా అంచనాలను తప్పగా మహేష్ తో చేసిన బ్రహ్మోత్సవం సినిమా తో మరో అద్బుతం సృష్టించాలి అనుకున్నా ఆ సినిమా అందరి అంచనాలను తప్పి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ తలనొప్పి సినిమాల్లో ఒకటిగా చేరి భారీ ఫ్లాఫ్ గా నిలిచింది.

ఈ ఫ్లాఫ్ వలెనే శ్రీకాంత్ అడ్డాల కెరీర్ చాలా స్లో అయిపొయింది. క్రేజ్ మొత్తం పోయింది… 2016 లో వచ్చిన ఈ సినిమా తర్వాత కొత్త సినిమా మొదలు పెట్టడానికి ఆల్ మోస్ట్ 4 ఏళ్ళు పట్టింది… అది కూడా తన కథ కాకుండా వేరే కథ తో చేస్తున్న రీమేక్ సినిమా… అందునా… అప్పటి వరకు తను చేసిన…

సాఫ్ట్ ఫ్యామిలీ మూవీస్ కాకుండా మాస్ ఎలిమెంట్స్ కంప్లీట్ రూరల్ మాస్ ఎలిమెంట్స్ తో కూడుకున్న నారప్ప సినిమా చేస్తున్న అడ్డాల అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది తను వేరే కొత్త సినిమాలు కమిట్ అయ్యే వాడిని అన్న నమ్మకం తో ఉండగా కరోనా ఎఫెక్ట్ వలన అన్ని సినిమా లు పోస్ట్ పోన్ అవ్వగా…

నారప్ప ఏకంగా వచ్చే సమ్మర్ కి రానుందని సమాచారం. దాంతో శ్రీకాంత్ అడ్డాల మరో ఏడాది పాటు ఎదురు చూడక తప్పని పరిస్థితి. ఆ సినిమా సాధించే విజయం పైనే తన కొత్త సినిమాల కమిట్ మెంట్స్ ఆధారపడ్డాయని సమాచారం. దాంతో ప్రస్తుతానికి డైలమా లో ఉన్న డైరెక్టర్ నారప్ప రిలీజ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు.

Leave a Comment