న్యూస్ బాక్స్ ఆఫీస్

సీటిమార్ డే 3 కలెక్షన్స్…దంచికొడుతున్నాడు!!

సమ్మర్ లో సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన థియేటర్స్ అన్నీ మూత పడగా తిరిగి తెరుచుకున్న తర్వాత వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ మాస్ సెంటర్స్ లో మాత్రం సినిమాలను చూడటానికి జనాలు పెద్దగా ఎగబడలేదు, సరైన మాస్ మూవీ రాలేదు కాబట్టి జనాలు మంచి మాస్ మూవీ కోసం ఎదురు చూస్తున్న టైం లో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగగా…

మొదటి రోజు నుండే దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా మాస్ సెంటర్స్ లో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులను పెట్టె రేంజ్ లో హోల్డ్ చేయడం విశేషం…

ఇక మూడో రోజు ఆదివారం అవ్వడం తో జోరు పెంచిన సినిమా రెండో రోజు తో పోల్చితే డ్రాప్స్ మార్నింగ్ మ్యాట్నీ షోలకు 10-15% రేంజ్ లోనే సొంతం చేసుకోగా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి గ్రోత్ ని చూపెట్టిన సినిమా 15% పైగానే గ్రోత్ ను సొంతం చేసుకుంది.

దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా 1.6 కోట్ల నుండి 1.7 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ కూడా ఇంకా జోరు చూపితే…

సినిమా మూడో రోజు 1.8 కోట్ల రేంజ్ కి పైగా వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఒకవేళ 2 కోట్ల రేంజ్ కి వెళితే మట్టుకు అద్బుతంగా హోల్డ్ చేసిందని చెప్పుకోవచ్చు. అలా జరిగితే వర్కింగ్ డేస్ లో కూడా సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసి బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఇంకా త్వరగా ఉంటుంది. మరి సినిమా ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Leave a Comment