న్యూస్ బాక్స్ ఆఫీస్

సీటిమార్ డే 4 కలెక్షన్స్…సాలిడ్ దెబ్బ ఇది!!

యాక్షన్ హీరో గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్లకి సీటిమార్ సినిమా బాగా నచ్చగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఓవరాల్ గా మంచి వసూళ్ళని సొంతం చేసుకున్నా…

అందులో నైజాం ఏరియాలో మట్టుకు కలెక్షన్స్ ఆశించిన మేర లేక పోవడం తో కొద్దిగా ఓవరాల్ కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేసినట్లు అనిపించగా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ ను సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేయాల్సిన అవసరం తో…

4 వ రోజును మొదలు పెట్టిన సీటిమార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వ రోజు తో పోల్చితే 4 వ రోజు భారీ డ్రాప్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది… నార్మల్ గానే వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ హెవీ గా ఉంటాయి కానీ సీటిమార్ కి ఇంకాస్త ఎక్కువగా కనిపించాయి.

దానికి తోడూ నైజాం ఏరియాలో సినిమా మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేస్తూ ఉండటం తో 3 వ రోజు పోల్చితే 4 వ రోజు టోటల్ గా డ్రాప్స్ 60% కి పైగా ఉన్నాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ఉన్నా టోటల్ డ్రాప్స్ ని చూస్తె సినిమా 4 వ రోజు 60 నుండి 70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం…

ఇప్పుడు కనిపిస్తుంది… కానీ సినిమా బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్ళాలి అంటే 4 వ రోజు ఎంత లేదన్నా 1 కోటి కి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆ మార్క్ ని 4 వ రోజు సినిమా అందుకోవడం కష్టమే… ఇక రానున్న రోజుల్లో అయినా సినిమా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.

Leave a Comment