న్యూస్ బాక్స్ ఆఫీస్

సీటిమార్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…సెన్సేషనల్!!

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అల్టిమేట్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ బుకింగ్స్ అంతంత మాత్రమే అనిపించినా కానీ మొదటి రోజుకి వచ్చే సరికి వినాయక చవితి హాలిడే వలన సినిమా కి భారీ అడ్వాంటేజ్ దక్కగా మార్నింగ్ షోల నుండే రాంపేజ్ చూపెట్టిన ఈ సినిమా మొదటి రోజు 3 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ లో…

కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందనిపించింది… నిజానికి అంతకుమించి కలెక్ట్ చేసింది కూడా… ఆంధ్రాలో చాలా మాస్ సెంటర్స్ లో 50% ఆక్యుపెన్సీ ఉన్నా 100% ఆక్యుపెన్సీ తో రన్ చేశారు ఫస్ట్ డే, కానీ కలెక్షన్స్ 50% కే రిపోర్ట్ చేశారు… ఆ కలెక్షన్స్ యాడ్ అయితే మినిమం 3.8 కోట్ల రేంజ్ లో…

మొదటి రోజు కలెక్షన్స్ ఉంటాయి అని చెప్పాలి. అయినా కానీ ఓవరాల్ గా మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 2.98 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 3.16 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంది, గ్రాస్ 5 కోట్లకు పైగా వచ్చింది.

ఒకసారి సినిమా ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని ఏరియాల వారిగా గమనిస్తే…
👉Nizam: 91L
👉Ceeded: 55L
👉UA: 30L
👉East: 27L(6L hires)
👉West: 16L
👉Guntur: 41L(11L hires)
👉Krishna: 19L
👉Nellore: 19L(5L hires)
Total AP TG: 2.98CR(4.75cr~ Gross)(22L hires)
👉KA+ROI: 14L
👉OS: 4L~(No release in USA)
TOTAL Collections: 3.16CR(5.10CR~ Gross)

సినిమాను మొత్తం మీద 11.5 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు మరో 8.84 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది. వీకెండ్ ఇప్పుడు చాలా కీలకం అని చెప్పాలి. మరి సినిమా వీకెండ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Leave a Comment