న్యూస్ బాక్స్ ఆఫీస్

సీటిమార్ 5 డేస్ కలెక్షన్స్…డే 5 బానే వచ్చాయి కానీ!!

నైజాం కలెక్షన్స్ కొంచం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నా ఓవరాల్ గా మొదటి వీకెండ్ లో మంచి వసూళ్ళనే సొంతం చేసుకున్న గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డేస్ లో కూడా నైజాం కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేయడం వలన కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తున్నా ఓవరాల్ గా చూసుకుంటే బాగానే హోల్డ్ చేస్తుంది కానీ అది సినిమా….

బ్రేక్ ఈవెన్ రేంజ్ ని అందుకోవడానికి సరిపోవడం లేదని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు 72 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ వలన 35 నుండి 45 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు అనుకున్నాము…

కానీ సినిమా 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 51 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని డీసెంట్ కలెక్షన్స్ నే దక్కించుకుంది కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మొత్తం మీద 5 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.10Cr
👉Ceeded: 1.48Cr
👉UA: 96L
👉East: 77L
👉West: 43L
👉Guntur: 89L
👉Krishna: 44L
👉Nellore: 39L
Total AP TG: 7.46CR(12.21CR~ Gross)
👉KA+ROI: 29L
👉OS: 8L~(No release in USA)
TOTAL Collections: 7.83CR(13CR~ Gross)

సినిమా టోటల్ బిజినెస్ రేంజ్ 11.5 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 12 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానే 5 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 4.17 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… సినిమా ఇలానే మిగిలిన రోజుల్లో హోల్డ్ చేసి రన్ ని కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ని అందుకోవచ్చు.

Leave a Comment