న్యూస్ బాక్స్ ఆఫీస్

సీటిమార్ 9 డేస్ కలెక్షన్స్….9వ రోజు మైండ్ బ్లాంక్!!

యాక్షన్ హీరో గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి గోపీచంద్ కెరీర్ లో సాలిడ్ కంబ్యాక్ మూవీ గా నిలిచే రేంజ్ టాక్ తో దుమ్ము లేపగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం లో అండర్ పెర్ఫార్మ్ చేయడం, ఆంధ్రలో 50% ఆక్యుపెన్సీ అండ్ లో టికెట్ రేట్ల ఎఫెక్ట్ వలన ఇబ్బంది పడినా వీకెండ్ లో బాగానే పెర్ఫార్మ్ చేసింది…

తర్వాత వర్కింగ్ డేస్ స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ అందుకోవాల్సిన బిజినెస్ రేంజ్ ఎక్కువగా ఉండటం తో ఆ రేంజ్ లో హోల్డ్ ని సొంతం చేసుకోలేక పోయిన సినిమా ఆశలన్నీ కూడా సెకెండ్ వీకెండ్ మీదే పెట్టుకోగా 9 వ రోజు శనివారం అవ్వడం తో….

8 రోజు కన్నా బెటర్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు అనుకున్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు తో పోల్చితే సాలిడ్ డ్రాప్ నే సొంతం చేసుకుంది. 8 వ రోజు 30 లక్షల రేంజ్ షేర్ ని అందుకుంటే, 9 వ రోజు కి వచ్చే సరికి సినిమా 22 లక్షల షేర్ నే సాధించింది.

ఇక సినిమా 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.38Cr
👉Ceeded: 1.72Cr
👉UA: 1.21Cr
👉East: 91L
👉West: 55L
👉Guntur: 1.02Cr
👉Krishna: 54L
👉Nellore: 46L
Total AP TG: 8.79CR(14.60CR~ Gross)
👉KA+ROI: 33L
👉OS: 8L~(No release in USA)
TOTAL Collections: 9.20CR(15.50CR~ Gross)

సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు కాగా క్లీన్ హిట్ ఇంకా 2.8 కోట్లు కావాలి, 9 వ రోజు గ్రోత్ ఉంటే 10 వ రోజు మరింత గ్రోత్ చూపెట్టే ఛాన్స్ ఉండేది, కానీ 9 వ రోజు సినిమా ప్రదర్శన చూసిన తర్వాత ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ అవ్వడం కష్టమే అని తెలుస్తుంది. 10 వ రోజు ఏదైనా అద్బుతం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Comment