న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

సీడెడ్ దెబ్బ కొట్టినా…ఆల్ టైం టాప్ 4!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కి అన్ని ఏరియాలలో సాలిడ్ ఫాలోయింగ్ ఉంది… కానీ రీసెంట్ టైం లో రాయలసీమ లో మహేష్ కి అనుకున్న రేంజ్ మాస్ మూవీస్ పడకా సినిమాలకు అనుకున్న లెవల్ లో కలెక్షన్స్ రావడం లేదు. పోకిరి రేంజ్ మాస్ మూవీస్ ఇప్పుడు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఆ మ్యాటర్ పక్కన పెడితే రీసెంట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర సీడెడ్ ఏరియాలో ఫైనల్ కలెక్షన్స్ పరంగా 12.6 కోట్ల బిజినెస్ కి 2 కోట్లకు పైగా నష్టపోనుంది.

అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 వారాలు ముగిసే ముందే ఏకంగా 80 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి ఆల్ టైం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల జాబితాలో 4 ప్లేస్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. ఇది వరకు బాహుబలి సిరిస్ మరియు రంగస్థలం మాత్రమే ఈ మార్క్ ని అధిగమించాయి.

ఇప్పుడు మహర్షి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 80 కోట్ల షేర్ మార్క్ ని రెండు రాష్ట్రాలలో అందుకున్న నాలుగో సినిమా గా నిలిచింది, సీడెడ్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి ఉంటె సినిమా మరింత కలెక్ట్ చేసి దుమ్ము లేపి ఉండేది. ఆ ఏరియా దెబ్బ కొట్టినా కూడా ఏకంగా ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!