న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

సీడెడ్ లో సాహో బిజినెస్…చరిత్ర చిరిగిపోయింది!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కి సిద్ధం అవుతున్నాడు, బాహుబలి తో నేషనల్ లెవల్ సూపర్ స్టార్ గా మారిన రెబల్ స్టార్ ఇప్పుడు అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న సాహో సినిమా తో ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు, కాగా ఈ సినిమా ఆల్ మోస్ట్ బిజినెస్ ని కంప్లీట్ చేసుకుందని చెప్పొచ్చు. అందులో ముందుగా సీడెడ్ లో సినిమా బిజినెస్…

రికార్డుల దుమ్ము దుమారం చేసిందని చెప్పొచ్చు. బాహుబలి తప్పితే మరే సినిమా కూడా 20 కోట్ల బిజినెస్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు, కానీ సాహో ఏకంగా 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని రాయలసీమ ఏరియా లో సొంతం చేసుకుని ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ ను…

సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది, బాహుబలి 2 అక్కడ ఆల్ మోస్ట్ 28 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇప్పుడు సాహో సినిమా జస్ట్ 3 కోట్ల తో ఆ రికార్డ్ ను మిస్ అయినప్పటికీ మరే సినిమా కూడా దరిదాపుల్లోకి రాలేని ప్రీ రిలీజ్ బిజినెస్ తో చరిత్ర సృష్టించింది.

ఇక సినిమా కి ఈ ఏరియాలో భారీ ఎత్తున హైర్స్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం… హైర్స్ అంటే సింపుల్ గా ఒక ఏరియా ని గంపగుత్తుగా భారీ రేటు కి కొంటారు, ఆ ఏరియాలో టికెట్ రేట్లు ఇక వాళ్ళ ఇష్టం, లాభం వచ్చినా నష్టం వచ్చినా కొన్నవాళ్ళకే…

కానీ ఆ కొన్న అమౌంట్ ని మాత్రం మొదటి రోజు/మొదటి వీకెండ్/ మొదటి వారం షేర్ లో కలిపేస్తారు… సీడెడ్ మొత్తం మీద సినిమాకి రికార్డ్ లెవల్ లో హైర్స్ ఇప్పుడు ఉండబోతున్నట్లు సమాచారం. ఫైనల్ కౌంట్ ఎంత అనేది రిలీజ్ టైం లో తెలిసిపోతుంది. ఇక సాహో తో ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ ని ఈ ఏరియాలో సృష్టిస్తాడో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!