న్యూస్

సీనియర్ హీరోయిన్ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేసింది!!

ప్రజెంట్ జనరేషన్ టాలీవుడ్ యాక్టర్స్ లో నటన పరంగా ఎలాంటి వంక పెట్టె చాన్స్ ఇవ్వకుండా బెస్ట్ యాక్టింగ్ తో మెప్పించే నటుడు ఎన్టీఆర్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ డైరెక్టర్ ల చేత మెప్పించుకునే ఎన్టీఆర్ ని నటన పరంగా పొగడని వాళ్ళు ఉండరు అనే చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయిన అర్చన గారు ఎన్టీఆర్ ని ఈ విషయం లో ఆకాశానికి ఎత్తేశారు రీసెంట్ ఇంటర్వ్యూలో.

80’s లో నిరీక్షణ మరెన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించిన అర్చన గారు తర్వాత సడెన్ గా మాయం అయ్యారు, ఆల్ మోస్ట్ 25 ఏళ్ల తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఈటీవీ లో ఆలీ షో లో ప్రత్యక్షం అయ్యి పాత జ్ఞాపకాలు అన్నీ నెమరు వేసుకున్నారు ఈమె…

ఈ సందర్భంగా ఇప్పటి మూవీస్ లో ఏవి బాగా నచ్చాయి అని ఆలీ అడగగా మహానటి సినిమా తనకి చాలా నచ్చిందని మెచ్చుకున్న అర్చన అందులో కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ ని ఓ రేంజ్ లో మెచ్చుకోగా ఈ సినిమా తో పాటు ఎన్టీఆర్ మరియు మోహన్ లాల్ ల…

కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చాలా బాగా మెప్పించింది అని చెప్పుకొచ్చారు అర్చన గారు… హన్ లాల్ లాంటి లెజెండరీ నటుడు ఉండగా ఆయన ముందు పెర్ఫామ్ చేయడం చిన్న విషయం కాదని కానీ ఎన్టీఆర్ అలా నటించడమే కాకుండా మెప్పించారని, దాంతో పాటు మోహన్ లాల్ గారికి నటించడానికి స్పేస్ ఇస్తూ తన టైం వచ్చినప్పుడు…

తన నటనతో ఈక్వల్ గా మ్యాచ్ చేయగలగడం విశేషం అని ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేశారు… అందుకే ఆ సినిమా అంటే తనకి చాలా ఇష్టమని చెప్పారు అర్చన. ఆల్ మోస్ట్ 25 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ తో మళ్ళీ లైం లైట్ కి వచ్చిన అర్చన ఇప్పుడు మళ్ళీ నటించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

Leave a Comment