గాసిప్స్ న్యూస్

సుకుమార్ కి చిరు కి గొడవ…కారణం ఇదే అంటున్నారు!!

10 ఏళ్ల తర్వాత వెండితెరపై సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 మరియు సైరా సినిమాల తో సంచలన కలెక్షన్స్ ని సాధించి దుమ్ము లేపిన విషయం తెలిసిందే, ముఖ్యంగా కంబ్యాక్ తర్వాత మెగాస్టార్ ఒక్క సినిమా కి యావరేజ్ గా 124 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుండగా ప్రస్తుతం మెగాస్టార్ తన 152 వ సినిమా ను కొరటాల శివ డైరెక్షన్ లో చేయ బోతున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెల్లనుండగా సినిమాను వచ్చే ఇయర్ సమ్మర్ రేసులో లేకపోతె సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి 153 వ సినిమా గా మలయాళం లో సూపర్ డూపర్ హిట్ అయిన…

లూసిఫర్ సినిమా ను తెలుగు లో రీమేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది, రీమేక్ రైట్స్ కొన్న రామ్ చరణ్ ఈ రీమేక్ పనులను సుకుమార్ కి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే, కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా పనిలో ఉన్న సుక్కు ఆ సినిమా తర్వాత ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.

కానీ కథ యావరేజ్ గా ఉండటం తో మెగాస్టార్ కి ఈ కథ బాగుందని, దాని కన్నా ఎన్నో రెట్లు మంచి కథ తన దగ్గర ఉందని ఆ సినిమా చేద్దామని సుక్కు మెగాస్టార్ తో చెప్పాడని టాక్ వస్తుంది, కానీ సుకుమార్ ఓన్ కథ తో సినిమా అంటే చాలా సమయం తీసుకుంటాడని, కానీ ఇది రీమేక్ కాబట్టి త్వరగా పూర్తీ అవుతుందని, అలాగే ముగ్గురు మెగా హీరోలు ఇందులో నటించేందుకు అవకాశం ఉండటంతో

 మెగాస్టార్ ఈ కథనే చేద్దామని సుకుమార్ తో అన్నాడని ఇండస్ట్రీ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సుకుమార్ కొంత అయిష్టంతోనే ఈ రీమేక్ కి సిద్ధం అవుతున్నాడనే టాక్ కూడా ఉంది. కానీ సినిమా మొదలు అవ్వడానికి ఇంకా చాలా సమయమే ఉండటం తో అప్పటి వరకు ఏవైనా మార్పులు జరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

 

Leave a Comment