టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

సుల్తాన్ తమిళ్ టోటల్ కలెక్షన్స్…ఇక్కడ దెబ్బ పడినా అక్కడ కుమ్మింది!

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రిలీజ్ ను సొంతం చేసుకున్న కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ సుల్తాన్ తమిళ్ మరియు తెలుగు లో ఒకేసారి రిలీజ్ అయినా ఓపెనింగ్స్ తెలుగు లో బెటర్ గా వచ్చాయి కానీ ఇక్కడ లాంగ్ రన్ సినిమాకి దక్కలేదు, దానికి తోడూ పోటి కూడా ఎక్కువగానే ఉండటం తో పరుగును త్వరగానే ముగించి భారీ నష్టాలనే ఈ సినిమా తెలుగు లో సొంతం చేసుకుంది..

6.5 కోట్ల టార్గెట్ కి సినిమా 3.54 కోట్ల షేర్ ని మాత్రమే సాధించి ఫ్లాఫ్ గా నిలిచింది… ఇక సినిమా తమిళ్ కలెక్షన్స్ విషయానికి వస్తే… తమిళ్ లో మొత్తం మీద 17 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 2 వారాల్లో 31 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకోగా…

తర్వాత రన్ కంప్లీట్ అయ్యే టైం కి 37.4 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ను ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి సొంతం చేసుకోగా టోటల్ షేర్ 19.5 కోట్ల దాకా వచ్చిందని అంటున్నారు. దాంతో సినిమా తమిళ్ వర్షన్ మొత్తం మీద బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ఆల్ మోస్ట్ క్లీన్ హిట్ గా నిలిచింది.

మొత్తం మీద తెలుగు తమిళ్ లో కలిపి సినిమా 43.84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ షేర్ 23.04 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. తెలుగు లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎఫెక్ట్ గట్టిగానే ఉన్నప్పటికీ కూడా తమిళ్ లో సినిమా మంచి కలెక్షన్స్ పోటి లో కూడా సొంతం చేసుకుంది.

ధనుష్ కర్ణన్ నుండి పోటి ఎదురు అయినా కానీ సినిమా మంచి వసూళ్ళనే సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. తెలుగు లో పోటి ఎక్కువ ఉండటం వలన ఓవరాల్ గా దెబ్బ పడినట్లు అయింది. మొత్తం మీద కార్తీ కి దొంగ డిసాస్టర్ తర్వాత ఈ సినిమా మంచి కంబ్యాక్ గా నిలిచింది అని చెప్పొచ్చు.

Leave a Comment