న్యూస్ రివ్యూ

సుల్తాన్ మూవీ రివ్యూ-కుమ్మింది సినిమా కానీ!!

కార్తీ రష్మిక ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ సుల్తాన్, బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా టీసర్ ట్రైలర్ లతోనే మంచి బజ్ ను సొంతం చేసుకుంది, ఇక ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ పాయింట్ కి వస్తే… రోబోటిక్స్ చేసిన హీరో…

జపాన్ లో కంపెనీ పెట్టాలి అనుకుంటాడు, ఊరికెళ్ళి తన తండ్రితో కొంతకాలం ఉండాలని వచ్చిన హీరో ఊరికి వచ్చాక హీరోయిన్ రష్మికతో లవ్ లో పడతాడు, అనుకోని కారణాల తన తండ్రి చనిపోవడం తో తండ్రికి ఇచ్చిన మాటతో తన ఇంట్లో ఉండే 94 మందిని కాపాడే భాద్యత అలాగే ఊరి భూములను లాక్కోవడానికి వచ్చిన…

విలన్ ని హీరో ఎలా ఎదిరించి గెలిచాడు అన్నది సినిమా కథ… కృష్ణుడు పాండవుల పక్షంలో కాకుండా కౌరవుల పక్షంలో ఉంటే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కంప్లీట్ ఓ కమర్షియల్ మాస్ మూవీ అని చెప్పొచ్చు. కథ కాన్సెప్ట్ కొత్తగా చెప్పడానికి అనిపించినా…

స్క్రీన్ పై మాత్రం చాలా రొటీన్ గానే అనిపిస్తుంది, సీన్ బై సీన్ ఏం అవుతుందో ఎం జరుగుతుందో అన్నది ఆడియన్స్ ఇట్టే చెప్పగలరు, అయినా కానీ సినిమా ఫక్తు కమర్షియల్ మూవీలానే చాలా వరకు మెప్పించింది, అక్కడక్కడా లైట్ కామెడీ, ఇంటర్వెల్ అండ్ సెకెండ్ ఆఫ్ లో వచ్చే ఓ ఫైట్ సీన్ సాలిడ్ గా మెప్పించాగా… కార్తీ పెర్ఫార్మెన్స్ పరంగా దుమ్ము లేపాడు.

కొంత గ్యాప్ తర్వాత పక్కా కమర్షియల్ మూవీ తో వచ్చిన కార్తీ చాలా వరకు మెప్పించాడని చెప్పొచ్చు. ఇంటర్వెల్ ఫైట్ రీసెంట్ టైమ్ లో వచ్చిన వన్ ఆఫ్ బెస్ట్ మాస్ ఫైట్ తో ఆకట్టుకోగా అలా అక్కడక్కడా కొన్ని సీన్స్ మెప్పించి మొత్తం మీద సినిమా కథ వీక్ గా అనిపించినా సీన్ బై సీన్ మెప్పిస్తుంది….

కథ రొటీన్ గా ఉండటం లెంత్ కొంచం ఎక్కువ అవ్వడం, తమిళ్ ఫ్లేవర్ కూడా ఎక్కువ అవ్వడం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్, కార్తితో పాటు రష్మిక పెయిర్ బాగుండటం, ఫైట్స్ బాగుండటం, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుండటం లాంటివి సినిమా కి ప్లస్ పాయింట్స్… మొత్తం మీద సింపుల్ గా చెప్పాలి అంటే… సినిమా పరంగా కుమ్మినా కానీ కథ పరంగా పరమ రొటీన్ మూవీ సుల్తాన్…

అయినా కానీ ఆడియన్స్ ను మెప్పించడం విషయంలో చాలా వరకు సక్సెస్ అయిన సినిమా కార్తీ కి ఖైదీ తర్వాత మరో మంచి మూవీ గా అండ్ కంబ్యాక్ మూవీ గా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి ప్రదర్శన ని కనబరుస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరం అని చెప్పాలి.

Leave a Comment