న్యూస్ బాక్స్ ఆఫీస్

సుల్తాన్ 3 డేస్….తెలుగు+తమిళ్ టోటల్ కలెక్షన్స్….తెలుగు లో హిట్ కి ఇంకా ఎంత కావాలి?

కార్తీ రష్మిక ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ సుల్తాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి పర్వాలేదు బాగుంది అనిపించే టాక్ లభించగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా సినిమా తెలుగు రాష్ట్రాలలో వీకెండ్ ను పర్వాలేదు అనిపించే విధంగా ముగించింది, సినిమా రెండో రోజు తో పోల్చితే మూడో రోజు గ్రోత్ ఏమి సాధించక పోయినా కానీ రెండో రోజు లెవల్ లోనే…

కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేస్తూ 71 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుని బాగా పెర్ఫార్మ్ చేసింది, కానీ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి ఈ కలెక్షన్స్ పెద్దగా సరిపోవు అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో…

సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 91L
👉Ceeded: 43L
👉UA: 31L
👉East: 24L
👉West: 15L
👉Guntur: 21L
👉Krishna: 23L
👉Nellore: 12L
AP-TG Total:- 2.60CR (4.83Cr Gross~)
ఇవీ సినిమా తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ కలెక్షన్స్… ఇక సినిమా తమిళ్ లో మూడు రోజులు…

పూర్తీ అయ్యే టైం కి 18 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. తెలుగు తమిళ్ కలిపి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమచారం. తమిళ్ లో సినిమా బిజినెస్ లెక్కలు ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉండగా… తమిళ్ లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటున్న సినిమా…

తెలుగు రాష్ట్రాలలో మాత్రం 6 కోట్ల బిజినెస్ ను 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 3.9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంటుంది. ఇక సినిమా వీక్ డేస్ లో ఎలాంటి ప్రదర్శన ని కనబరుస్తుందో అనేది ఆసక్తిగా మారింది అని చెప్పాలి.

Leave a Comment