న్యూస్

సూపర్ ఫామ్ లో ఉన్న విజయ్…కొత్త సినిమా రెమ్యునరేషన్ కి కోలివుడ్ మొత్తం షాకయ్యింది!!

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ రీసెంట్ టైం లో కెరీర్ లోనే ది బెస్ట్ ఫాం లో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ సూపర్ హిట్ సినిమాలతో జోరు చూపుతూ దూసుకు పోతున్న విజయ్ మెర్సల్, సర్కార్, బిగిల్ మరియు మాస్టర్ సినిమాలతో బాక్ టు బాక్ సెన్సేషనల్ హిట్స్ ని సొంతం చేసుకుని తన రేంజ్ ని మరింత భారీగా…

పెంచుకున్నాడని చెప్పొచ్చు… దాంతో విజయ్ సినిమాలకు షూటింగ్ టైం లోనే బిజినెస్ మొత్తం కంప్లీట్ అవుతూ వస్తుండగా విజయ్ సినిమాల రెమ్యునరేషన్ కూడా ఆల్ టైం రికార్డ్ లెవల్ లో పెరిగి పోతూ వస్తుంది. కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మొట్ట మొదటి 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా నిలిచి రికార్డ్…

క్రియేట్ చేయగా తర్వాత విజయ్ ఈ 100 కోట్ల రెమ్యునరేషన్ ని అందుకుని సంచలనం సృష్టించాడు.. ఇక లేటెస్ట్ గా నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా బీస్ట్ సినిమా కోసం రెమ్యునరేషన్ మరోసారి రికార్డ్ లెవల్ లలో 110 కోట్ల వరకు అమౌంట్ ని అందుకోబోతున్నాడని కోలివుడ్ న్యూస్.

ఈ రెమ్యునరేషన్ ఇంతటితో ఆగకుండా ఓవరాల్ బిజినెస్ అండ్ ప్రాఫిట్ లో ప్రాఫిట్ షేర్ కింద 15% వరకు కూడా రెమ్యునరేషన్ లో భాగంగా వెళుతుందని కోలివుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ కలిపి ఎంత లేదన్న 130 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ మినిమమ్ విజయ్ కి వెళుతుందని చెబుతున్నారు అక్కడ… ఇది విని టోటల్ కోలివుడ్ కూడా… ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఏంటి బాబోయ్ అంటూ…

అనుకుంటున్నారని సమాచారం. కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న హీరో కాబట్టి బాక్ టు బాక్ హిట్స్ కొడుతున్న హీరో కాబట్టి ఈ రేంజ్ రెమ్యునరేషన్ సమంజసం అనే అంటున్నారు. తెలుగు లో వంశీ పైడిపల్లితో చేయబోతున్న అప్ కమింగ్ మూవీ విషయం లో కూడా ఇదే రేంజ్ రెమ్యునరేషన్ ని విజయ్ తీసుకునే అవకాశం ఎంతైనా ఉందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

Leave a Comment