న్యూస్ బాక్స్ ఆఫీస్

సూపర్ స్టార్ రాంపేజ్…సరిలేరు నీకెవ్వరు తమిళ్ డబ్ కి రికార్డ్ థియేటర్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతి బరిలో నిలిచి భారీ పోటి ని కూడా తట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మహేష్ కెరీర్ లో నంబర్ 1 గా అలాగే టాలీవుడ్ టాప్ షేర్ మూవీస్ లో నిలిచిన విషయం తెలిసిందే, అలాంటి ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ…

తర్వాత టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయినప్పుడు సాలిడ్ గా రేటింగ్ లను సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేయగా సినిమా తర్వాత మహేష్ అప్ కమింగ్ మూవీ సర్కారు వారి పాట మొదలు పెట్టడానికి సిద్ధం అవుతూ ఉండగా… ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా తమిళనాడులో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతుంది.

ఆల్ మోస్ట్ 8 నెలలు మూసేసిన థియేటర్స్ ని రీసెంట్ గా అక్కడ రీ ఓపెన్ చేయగా కొత్త సినిమాలను రిలీజ్ చేయగా వాటి పెర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా ఇక ఆడియన్స్ కి మంచి మంచి ఆప్షన్స్ ఉండాలి అని కొత్త సినిమాలనే ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు.

అందులో భాగంగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాను అక్కడ డబ్ చేయగా సినిమా 20 వ తారీఖున భారీగా రిలీజ్ చేయబోతున్నారు. తమిళనాడు లో థియేటర్స్ సంఖ్య చాలా తక్కువ అన్న విషయం తెలిసిందే, అక్కడ ఆల్ రెడీ రెండు కొత్త సినిమాల కోసం 550 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా ఇప్పుడు…

సరిలేరు నీకెవ్వరు సినిమాను 220 థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఇన్నేసి థియేటర్స్ అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. మహేష్ బాబు కి తమిళ్ లో మంచి క్రేజ్ ఉన్న నేపధ్యంలో సినిమా చూడటానికి జనాలు థియేటర్స్ కి వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా అక్కడ ఎలాంటి కలెక్షన్స్ ని రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి…

Leave a Comment