గాసిప్స్ న్యూస్

సూపర్ స్టార్ స్పీడ్…..3 షెడ్యూల్స్ తో అవగొట్టాలి!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకటి తర్వాత ఒకటి మూడు హిట్ల తో హాట్రిక్ కంప్లీట్ చేసి సూపర్ ఫాం లో దూసుకు పోతుండగా ఇప్పుడు గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్షన్ లో భారీ ఎత్తున చేస్తున్న సినిమా సర్కారు వారి పాట సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టె పనిలో నిమగ్నమై ఉన్నాడు. సినిమా ను మే 31 న అనౌన్స్ చేసి టైటిల్ కూడా రిలీజ్ చేసినా కానీ….

కరోనా వలన రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి చాలా టైం పడుతుంది, ఇంకా కరోనా తగ్గకపోయినా కానీ దాదాపు చాలా సినిమాల షూటింగ్ లు మొదలు అయిన నేపధ్యంలో సర్కారు వారి పాట షూటింగ్ ని మొదలు పెట్టె పనిలో ఉండగా…

ముందుగా సినిమా షూటింగ్ ఫారన్ లో జరగబోతుంది, ఆల్ మోస్ట్ వీసా పనులు పూర్తీ కావొస్తుండగా 45 రోజుల లాంగ్ షెడ్యూల్ ని ఫారన్ లో ప్లాన్ చేసిన టీం  వాషింగ్టన్, ఫ్లోరిడా లోనే చాలా బాగం షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. ఇయర్ ఎండ్ కి ఈ షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు.

ఇక మహేష్ బాబు ఇండియా కి తిరిగి వచ్చిన తర్వాత మరో 2 షెడ్యూల్స్ లో సినిమా పూర్తీ అవ్వాలని కానీ క్వాలిటీ విషయం లో తగ్గకూడదని చెప్పగా, సినిమా రెండో షెడ్యూల్ 3 అంతస్తుల బ్యాంక్ సెట్ లో జనవరి ఎండ్ నుండి జరుగుతుందని, నెల రోజుల షెడ్యూల్ లో చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఇక తర్వాత ఇండియా లో…

వివిధ ప్రదేశాల్లో మూడో షెడ్యూల్ ని ప్లాన్ చేయబోతున్నారని, దాంతో టాకీ పార్ట్ పూర్తీ అవుతుందని సమాచారం.. మహేష్ కూడా ముందు సినిమాను సమ్మర్ రేసులోనే నిలపాలి అనుకున్నా డిలే అవ్వడంతో ఆగస్టు నాటికి రిలీజ్ చేయాలనీ ప్లానింగ్ లో ఉన్నారని, అందుకే జెట్ స్పీడ్ తో ఇంత భారీ సినిమాను తక్కువ టైం లో పూర్తీ చేయాలనీ చూస్తున్నారని అంటున్నారు.

Leave a Comment