న్యూస్ బాక్స్ ఆఫీస్

సూపర్ హిట్ మూవీ…మళ్ళీ రీ రిలీజ్…ఎక్కడో తెలుసా??

2020 సమ్మర్ మొత్తం లాక్ డౌన్ తోనూ అలాగే రోజు కలెక్షన్స్ లెక్కలు చూసుకోవాల్సిన టైం లో ఈ చోట ఇన్ని పాజిటివ్ కేసు లు అంటూ లెక్కలు మాట్లాడుకోవాల్సి వస్తుంది, టాలీవుడ్ కి ఈ ఇయర్ సాలిడ్ గా స్టార్ట్ దక్కినా కానీ సమ్మర్ మాత్రం లాక్ డౌన్ తోనే సరిపోయింది, ఇండియా తో పాటు వరల్డ్ వైడ్ సినిమా కూడా పూర్తిగా లాక్ డౌన్ తోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక థియేటర్స్ ఎప్పుడూ మళ్ళీ మునుపటి లా ఓపెన్ అవుతాయో చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడగా, చాలా వరకు ఓవర్సీస్ లో కూడా థియేటర్స్ అన్నీ మూసేసే ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల మాత్రం చాలా లిమిటెడ్ గా థియేటర్స్ ని ఓపెన్ చేస్తున్నారు.

కాగా ఇప్పుడు అలా ఓపెన్ చేసిన థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ ని సొంతం చేసుకుంది లాక్ డౌన్ ఎండ్ టైం లో వచ్చిన సూపర్ హిట్ మూవీ కనులు కనులను దోచాయంటే సినిమా. ఈ సినిమా తెలుగు లో క్లీన్ హిట్ గా నిలవగా తమిళ్ లో సూపర్ హిట్ గా…

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కాగా లాక్ డౌన్ వలన ఇక్కడ సరిగ్గా కలెక్షన్స్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ అవ్వగా ఇప్పుడు ఈ సినిమా ను దుబాయ్ లో మళ్ళీ రీ రిలీజ్ చేశారు, 5 థియేటర్స్ లో సినిమా తమిళ్ వర్షన్ ని రీ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వస్తుంది.

డిజిటల్ రిలీజ్ ఆల్ రెడీ జరిగినా కానీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోరుకునే వారు ఈ సినిమా ను తిరిగి చూడటానికి వస్తున్నారట. మునుపటి లా భారీ సంఖ్య లో కానున్నా థియేటర్ ఎంట్రీస్ డీసెంట్ గా ఉన్నాయని అంటున్నారు. ఇక ఇండియా లో కంప్లీట్ గా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్నది ఆసక్తిగా మారగా, ఆగస్టు నుండి ఓపెన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు..

Leave a Comment