న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

సూపర్ హీరో కాదు…విలన్ మూవీ తో 7000 కోట్లు…చరిత్రలో తొలిసారి!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైనా హీరో పేరు మీదే కలెక్షన్స్ వచ్చేవి, ఏవో కొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ కి పేరు వస్తుంది కానీ విలన్ రోల్ మీదే సినిమా నడిచేంత సత్తా ఉన్న సినిమా అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ ఇప్పుడు అలాంటి సినిమా నే ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టించి ఆల్ టైం రికార్డులను నమోదు చేసి ఏకంగా హీరోల సినిమాలే కాకుండా.. సూపర్ హీరోల…

సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఆ సినిమానే జోకర్. హాలీవుడ్ లో మార్వేల్ కంపెనీ తో పోటి పడుతూ సూపర్ హీరోల మూవీస్ రూపొందించే DC కంపెనీ ఈ మధ్య కాలంలో స్లో డౌన్ అవ్వగా మరో పక్క మార్వేల్ నుండి…

వచ్చిన ప్రతీ అవెంజర్ మూవీ కానీ ఇతర క్యారెక్టర్స్ అయిన ఐరన్ మాన్, తోర్, హల్క్, బ్లాక్ పాంథర్, కాప్టన్ మార్వేల్ లాంటి సినిమాలు సంచలనాలు సృష్టిస్తున్న సమయంలో ఇప్పటికీ 2008 లో వచ్చిన బ్యాట్ మాన్ సిరీస్ లోని ది డార్క్ నైట్ సినిమానే బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ గా DC కంపెనీ కొనసాగిస్తుంది.

కానీ రీసెంట్ గా ది డార్క్ నైట్ లో బ్యాట్ మాన్ రోల్ తో సమానంగా హైలెట్ అయిన జోకర్ క్యారెక్టర్ నేపధ్యంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జోకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 1 బిలియన్ డాలర్స్ అంటే ఏకంగా 7000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి ఆర్ రేటెడ్ మూవీస్ లోనే కాదు.. DC కంపెనీ తరుపున…

టాప్ గ్రాసర్ గా ఉన్న ది డార్క్ నైట్ ని కూడా క్రాస్ చేసి ఇప్పుడు నంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. సినిమా ఇంకా చైనా లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా అక్కడ కూడా రెచ్చిపోతే లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒక విలన్ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా ఈ రేంజ్ లో అద్బుతాలు సృష్టిస్తుంది అని ఎవ్వరూ ఊహించనే లేదు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!