న్యూస్ బాక్స్ ఆఫీస్

సూర్యవంశీ 1st డే కలెక్షన్స్…మాస్ భీభత్సం!

ఆల్ మోస్ట్ ఏడాదిన్నరగా బాలీవుడ్ ఇండస్ట్రీ తిరిగి తెరుకోవాలని ట్రై చేస్తూ వస్తుంది కానీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే మంచి క్రేజ్ ఉన్న మూవీ ఏది థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధంగా లేక పోవడంతో ఆడియన్స్ కూడా ఆశగా కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎట్టకేలకు లాస్ట్ ఇయర్ మోస్ట్ వాంటెడ్ మూవీ అయిన సూర్యవంశీ సినిమా ఇండియాలో రీసెంట్ గా భారీగా రిలీజ్ ను…

సొంతం చేసుకోగా సినిమా కి బుకింగ్స్ చివరి నిమిషం దాకా ఓపెన్ అవ్వక పోవడంతో మొదటి రోజు తక్కువలో తక్కువ 12 కోట్ల నెట్ కలెక్షన్స్ నుండి టాక్ బాగుంటే 16 కోట్లు ఆడియన్స్ ఇంకా మెచ్చుకుంటే 20 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా….

సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అందరి అంచనాలను మించి పోయి ఊహకందని లెవల్ లో హోల్డ్ చేసి 28.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో మొదటి రోజు సొంతం చేసుకుని మెంటల్ మాస్ అనిపించే ఓపెనింగ్స్ తో భీభత్సం సృష్టించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర….

సినిమా కలెక్షన్స్ పరంగా ఊచకోత కోస్తుందని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో సినిమా మొదటి రోజు 1.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని 1.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుందట, ఒక్క నైజాం ఏరియాలోనే సినిమా 84 లక్షల గ్రాస్ వసూల్ చేసింది. ఈ రేంజ్ లో పెర్ఫార్మ్ చేయడంతో…

ఇక వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత రాంపేజ్ ని చూపెట్టే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తుండగా హిందీ ఇండస్ట్రీ ఈ ఓపెనింగ్స్ తో తిరిగి ఊపిరి పీల్చుకుందని చెప్పాలి. మన పాన్ ఇండియా మూవీస్ కి కూడా ఇప్పుడు ఇది అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Leave a Comment