న్యూస్ బాక్స్ ఆఫీస్

సూర్యవంశీ@4200….భీభత్సం ఇది…..బుకింగ్స్…ఫస్ట్ డే ఎంత రావచ్చు!!

బాలీవుడ్ ఫస్ట్ వేవ్ తర్వాత నుండి అసలు కోలుకోలేక పోయింది, ఈ ఇయర్ కొన్ని సినిమాలు రిలీజ్ అయినా పెద్ద సినిమాలు ఏమి రిలీజ్ కి నోచుకోలేదు, అదే టైం లో సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వడంతో మళ్ళీ పరిస్థితి మొత్తం మారిపోగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు లేక థియేటర్స్ ఎప్పుడెప్పుడు తెరచుకుంటాయా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తూ ఉండగా దీపావళి కానుకగా సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ….

ఆడియన్స్ ముందుకు రాబోతుంది. లాస్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అప్పటి నుండి డైరెక్ట్ రిలీజ్ కి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో చెప్పి థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఇండియా వైడ్ గా…

సెకెండ్ వేవ్ తర్వాత ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రిలీజ్ కాబోతుంది. ఇండియాలో మొత్తం మీద 3000 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం మీద 1200 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 4200 థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా…

అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మొదలు అవ్వగా కొన్ని సెంటర్స్ లో ఎక్స్ లెంట్ బుకింగ్స్ జగరగా మల్టీప్లెక్స్ చైన్ తో సినిమా అగ్రిమెంట్స్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో చాలా చోట్ల బుకింగ్స్ లేట్ గాను కొన్ని చోట్ల ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా 4 కోట్ల వరకు వెనక్కి తీసుకువచ్చిందని అంటున్నారు.

ఇక సినిమా బిజినెస్ గురించిన వివరాలు ఏవి కూడా ఇంకా బయటికి రాలేదు, ఇక సినిమా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా తక్కువలో తక్కువ 12 కోట్ల రేంజ్ లో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని టాక్ బాగుంటే 15-16 కోట్ల రేంజ్ లో, ఇంకా బాగుంటే 20 కోట్ల దాకా కూడా సినిమా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Leave a Comment