న్యూస్ స్పెషల్

సూర్య ఫ్యాన్స్ ఊరమాస్…24 గంటల్లో సెన్సేషనల్ రికార్డ్!!

రీసెంట్ టైం లో సోషల్ మీడియా లో ఎదో ఒక ట్రెండ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మన టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ మరీ ఎక్కువగా ట్రెండ్స్ చేయడం తో ఇక కోలివుడ్ ఫ్యాన్స్ కూడా మేమేమి తక్కువ తిన్నాం అంటూ వాళ్ళు కూడా అడపాదడపా ట్రెండ్స్ చేయడం మొదలు పెట్టారు. హీరోల బర్త్ డే ట్రెండ్స్, సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ ఇలా అనేక ట్రెండ్స్ ఇప్పుడు ట్విట్టర్ లో రోజూ జరుగుతూనే ఉన్నాయి.

లేటెస్ట్ గా కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య బర్త్ డే త్వరలో ఉండగా దానికన్నా ముందు ఇతర ఫ్యాన్స్ చేసినట్లు అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ ని చేశారు సూర్య ఫ్యాన్స్. కాగా రీసెంట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డును విజయ్ ఫ్యాన్స్ బ్రేక్ చేయగా…

ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డ్ ను సూర్య ఫ్యాన్స్ బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను సాధించారు. విజయ్ ఫ్యాన్స్ ట్రెండ్ ని కంప్లీట్ చేయలేదు.. ఆ రోజే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వలన ట్రెండ్ ని మధ్యలో ఆపినా పాత రికార్డ్ ను బ్రేక్ చేసింది, ఇప్పుడు ఆ రికార్డ్ ను సూర్య ఫ్యాన్స్ బ్రేక్ చేశారు.

మొత్తం మీద 24 గంటల్లో 6.8 మిలియన్ ట్వీట్స్ ని అడ్వాన్స్ ట్రెండ్ లో పోల్ చేసి సూర్య ఫ్యాన్స్ కొత్త రికార్డ్ ను నమోదు చేశారు. దాంతో ఓవరాల్ గా హీరోల అడ్వాన్స్ బర్త్ డే CDP ట్రెండ్స్ లో సరికొత్త బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ ట్రెండ్స్ కి ఇప్పుడు టార్గెట్ గా సెట్ చేశారు సూర్య ఫ్యాన్స్.

ఒకసారి టాప్ అడ్వాన్స్ బర్త్ డే CDP ట్రెండ్స్ ని గమనిస్తే…
1. #SuriyaBirthdayFestCDP(20)- 6.8M***
2. #THALAPATHYBdayFestCDP(20)- 6M
3. #NTRBirthdayCDP(20)- 5.2M~
4. #ThalaAjithBdayGalaCDP(20)- 4.6M
5. #SultanNTRBdayMonthCDP(20)- 2.7M
6. #PawanKalyanBirthdayCDP(19)- 2.2M
ఇవీ ఇప్పుడు లేటెస్ట్ గా టాప్ లో ఉన్న ట్రెండ్స్… ఈ రికార్డ్ కూడా త్వరలో జరిగే మహేష్ అండ్ పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ CDP ట్రెండ్స్ లో బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పాలి.

Leave a Comment