న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా@ఆల్ టైం టాప్ 4….కానీ షాక్ తప్పేలా లేదు!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన ఖైదీ నంబర్ 150 తో ఎలాంటి సంచలనాలు సృష్టించాడో అందరికీ తెలిసిందే, బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ వసూళ్లు సాధించిన ఆ సినిమా రిలీజ్ టైం లో అప్పటికి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది. ఇక తర్వాత ఏకంగా రెండున్నర ఏళ్ళు గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి తో రెండు తెలుగు రాష్ట్రాలలో…

అద్బుతమైన వసూళ్ళ ని సాధిస్తూ దూసుకు పోతున్నాడు, ఈ క్రమం లో సినిమా మొత్తం మీద 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 125 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న విషయం తెలిసిందే, కాగా సినిమా 10 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు మరో రికార్డ్ కొట్టింది.

టాలీవుడ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా మారిన రంగస్థలం ఓవరాల్ కలెక్షన్స్ అయిన 127 కోట్ల మార్క్ ని క్రాస్ చేయబోతుంది ఈ సినిమా.. 10 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఆ మార్క్ ని అందుకోబోతుందని చెప్పొచ్చు. దాంతో టాలీవుడ్ లో ఇప్పుడు ఓవరాల్ గా…

బాహుబలి సిరీస్, సాహో సినిమాల తర్వాత అఫీషియల్ గా నాలుగో హైయెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమా గా సైరా నరసింహా రెడ్డి నిలవనుంది. సినిమా మిగిలిన భాషల్లో కూడా జోరు చూపితే సాహో కి ధీటుగా వసూళ్లు వచ్చేవి కానీ అక్కడ డీలా పడటం తో తెలుగు టాప్ మూవీస్ తో పోటి పడాల్సి వస్తుంది.

కానీ ఓవరాల్ గా బడ్జెట్ దృశ్యా బిజినెస్ దృశ్యా సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పాలి ఓవరాల్ గా చూసుకుంటే… కానీ ఉన్నంతలో తెలుగు రాష్ట్రాలలో సినిమా జోరు కంటిన్యు అవుతుండటం ఒక్కటే ఇక్కడ కొంత సంతోషించే విషయం. ఇక సినిమా సెకెండ్ వీకెండ్ లో ఎలాంటి జోరు చూపుతుంతో చూడాలి.

Leave a Comment