న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా కలెక్షన్స్: బడ్జెట్ 270 కోట్లు, టార్గెట్ 188 కోట్లు…11 రోజుల్లో వచ్చింది ఇది!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు అద్బుతమైన కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, రెండు తెలుగు రాష్ట్రాలలో అనుకున్న రేంజ్ కన్నా బెటర్ కలెక్షన్స్ ని అందుకుని ఓవరాల్ గా రోజు ని సాలిడ్ గా ముగించింది. కానీ అదే సమయం లో ఇతర భాషల కలెక్షన్స్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక చేతులు ఎత్తేయడం తో ఆ ప్రెజర్ మొత్తం…

రెండు తెలుగు రాష్ట్రాల మీద పడటం తో ఎంత అద్బుతంగా కలెక్షన్స్ వస్తున్నా కానీ అవి బిజినెస్ ని అందుకునే దిశగా వెళ్ళడం లేదు, కానీ ఒక్క తెలుగు వర్షన్ పరంగా చూసుకుంటే సినిమా అద్బుతమైన కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది అని చెప్పొచ్చు.

సినిమా 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఏకంగా 2.73 కోట్ల షేర్ ని రాబట్టగా ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్ గా 11 వ రోజున సినిమా 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది, హిందీ, తమిళ్, కేరళలో సినిమా షాకింగ్ కలెక్షన్స్ తో డిసాస్టర్ వైపు అడుగులు వేస్తుంది.

ఓవరాల్ గా 11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
👉Nizam: 29.70C
👉Ceded: 17.54C
👉UA: 14.96C
👉East: 8.97C
👉West: 6.77Cr
👉Guntur: 9.21C
👉Krishna: 7.03C
👉Nellore: 4.06C
AP-TG: 98.24C
Karnataka – 13.34Cr
Tamil – 1.28Cr
Kerala – 0.70Cr
Hindi& ROI- 5.28Cr
USA/Can- 8.72Cr
ROW- 3.76Cr
11 days Total -131.32Cr(215.2cr Gross)

సినిమా ను 270 కోట్లతో తెరకెక్కించగా థియేట్రికల్ బిజినెస్ 187.25 కోట్లు కాగా టార్గెట్ 188 కోట్లకు అవ్వగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 56.68 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి 12 వ రోజు సినిమా ఎంతవరకు ఈ మొత్తంలో రికవరీ చేస్తుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!