గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా కి పోటిగా వస్తున్న వార్ సినిమా కి షాక్…అసలు విషయం ఏంటి అంటే!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే, తెలుగు అండ్ సౌత్ వరకు సినిమా క్రేజ్ భారీ గా ఉండటం తో టాక్ వస్తే కలెక్షన్స్ తో దుమ్ము లేపడం ఖాయం, ముఖ్యంగా తెలుగు లో పాజిటివ్ టాక్ వస్తే మెగాస్టార్ క్రేజ్ తో సినిమా సంచలన రికార్డులు నమోదు చేయడం ఖాయమని చెప్పొచ్చు.

కాగా సినిమా ని ఊరిస్తున్న అతి పెద్ద మార్కెట్ హిందీ… సౌత్ నుండి మంచి సినిమా వస్తే ఆదరిస్తాం అన్న రేంజ్ లో ఈ మధ్య సౌత్ సినిమాలను ఓ రేంజ్ లో కలెక్షన్స్ ని తెప్పిస్తున్నారు నార్త్ ఆడియన్స్, సైరా ని కూడా తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ తో పోల్చి…ఇది అల్టిమేట్ గా ఉందని…

ఇప్పటి నుండే అంచనాలను పెంచుకుంటున్నారు. కానీ సినిమా రిలీజ్ రోజునే హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ల “వార్” సినిమా భారీ ఎత్తున నార్త్ అండ్ సౌత్ లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుండటం తో సైరా కి ఎఫెక్ట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇదే సమయం లో ఇప్పుడు ఒక న్యూస్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాను నిర్మించిన యష్ రాజ్ ప్రొడక్షన్ వారు లాస్ట్ ఇయర్ తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ని అత్యంత భారీ రేట్ల కి అమ్మగా కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు, కానీ నిర్మాతలు వాళ్ళని ఆదుకోలేదు, ఈ వార్ సినిమా అయినా తక్కువ రేటు కి ఇస్తారు అనుకుంటే తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ కంటే భారీ రేట్లు చెబుతున్నారట.

దాంతో అందరు కలిసి ఈ సినిమా ని కొనకూడదని, తమ కి వచ్చిన లాస్ లను రికవరీ చేసే రేట్ల కి ఇస్తేనే తీసుకోవాలని కండీషన్ పెట్టారట, దాంతో ఆ సినిమా రిలీజ్ ఇప్పుడు డౌట్ లో పడింది అంటున్నారు. అదే కనుక జరిగితే సైరా కి బాలీవుడ్ లో కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ లభించే చాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!