న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా డే 11 కలెక్షన్స్….మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ ఊచకోత మళ్ళీ మొదలు అయింది, దసరా సెలవుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో ఎంటర్ అవ్వగా 10 వ రోజున కొంచం తక్కువ వసూల్లె సాధించినా తిరిగి జోరు చూపుతూ 11 వ రోజు శనివారం మరో సారి జూలు విదిల్చి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సినిమా డే 11 బాక్స్ ఆఫీస్ దగ్గర…

10 వ రోజు తో పోల్చుకుంటే డ్రాప్స్ చాలా తక్కువగానే కనిపించగా టోటల్ గా 5% లోపు డ్రాప్స్ ని మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో అందుకున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి తిరిగి గ్రోత్ ని సాధించి దుమ్ము లేపింది. ఆల్ మోస్ట్ 15% వరకు గ్రోత్ కనిపించింది.

దాంతో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల డ్రాప్స్ కవర్ అయ్యి టోటల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 10% ఓవరాల్ గ్రోత్ ఉంది, అంటే సినిమా ఇప్పుడు 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2.3 కోట్ల నుండి 2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

ఇక సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండి మాస్ సెంటర్స్ లో జోరు కూడా అనుకున్న విధంగా ఉంటె 2.6 కోట్ల రేంజ్ కి పైగానే కలెక్షన్స్ ని సినిమా 11 వ రోజు అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.9 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించవచ్చు.

టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా 11 వ రోజు కూడా 2 కోట్లకు పైగా షేర్ అంటే గొప్ప విషయమే, కానీ టార్గెట్ పెద్దది అవ్వడం తో ఈ కలెక్షన్స్ సరిపోవు అని చెప్పొచ్చు. కానీ ఇదే రోజు కంటిన్యు గా చూపిస్తూ దూసుకు పొతే సినిమా లాంగ్ రన్ లో టార్గెట్ కి దగ్గరగా వెళ్ళే చాన్స్ ఉంది. ఇక 11 రోజుల అఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment