న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా డే 12 ఓపెనింగ్స్…ఈ రోజు కలెక్షన్స్ జాతరే!!

మెగాస్టార్ మెగా మమ్మోత్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుని దుమ్ము లేపింది, సినిమా మిగిలిన చోట్ల కలెక్షన్స్ ఆశించిన మేర లేకున్నా రెండు తెలుగు రాష్ట్రాలలో అంచనాలకు మించి వసూళ్ళ ని సాధిస్తూ దూసుకు పోతున్న సైరా నరసింహా రెడ్డి ఇప్పుడు రెండో వీకెండ్ లో అడుగు పెట్టగా శనివారం అద్బుతంగా జోరు చూపిన సినిమా…

ఇప్పుడు ఆదివారం కూడా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, సినిమా 12 వ రోజు ఓపెనింగ్స్ పరంగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 11 వ రోజు తో పోల్చుకుంటే ఆల్ మోస్ట్ 10% గ్రోత్ కనిపిస్తుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్బుతంగా కొనసాగుతున్నాయి.

దాంతో సినిమా ఈ రోజు కలెక్షన్స్ జాతరే సృష్టించేలా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే 2.9 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో…

సినిమా చూపెట్టే హోల్డ్ ని బట్టి కలెక్షన్స్ కౌంట్ ఫైనల్ గా సాలిడ్ గా వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రోజు ముగిసే సరికి సైరా మినిమం 3.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. రిలీజ్ అయిన 12 వ రోజు…

ఈ రేంజ్ లో కలెక్షన్స్ అంటే చాలా గొప్ప విషయమే అని చెప్పొచ్చు. కానీ అందుకోవాల్సిన టార్గెట్ ఎక్కువ గా ఉండటం తో ఈ కలెక్షన్స్ సరిపోవడం లేదు అన్నది ఎవ్వరూ కాదన లేని నిజం, ఇక రోజు ముగిసే సరికి సినిమా టోటల్ గా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.

Leave a Comment