న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా డే 12 కలెక్షన్స్….ఇదేమి కుమ్ముడు సామి!!

మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా రిలీజ్ అయ్యి 11 రోజులు పూర్తీ కాగా 12 వ రోజు ఆదివారం అవ్వడం తో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకుంటూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది, 12 వ రోజు సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల గ్రోత్ ఓవరాల్ గా 10% వరకు ఉండగా…

ఈవినింగ్ అండ్ నైట్ షోల కి వచ్చే సరికి ఆ గ్రోత్ ఏకంగా 20% వరకు టచ్ అయింది, దాంతో సినిమా ఇప్పుడు 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 3.2 కోట్ల రేంజ్ కి ఏమాత్రం తగ్గని కలెక్షన్స్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…

అన్నీ అనుకున్నట్లు ఉండి మాస్ సెంటర్స్ లో కంటిన్యు గా గ్రోత్ ఉంటె మొత్తం మీద రోజు ముగిసే సరికి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా 3.5 కోట్ల మార్క్ ని కూడా అందుకోవచ్చు. ఇది టాలీవుడ్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ 12 వ రోజు కలెక్షన్స్ గా చెప్పుకోవచ్చు.

ఇక కర్ణాటక మరియు ఓవర్సీస్ లో ఈ రోజు సినిమా జోరు బాగానే కనిపిస్తుంది, మిగిలిన చోట్ల ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసిన సైరా సినిమా మొత్తం మీద 12 వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 3.8 కోట్ల నుండి అన్నీ అనుకున్నట్లు జరిగితే 4 కోట్ల వరకు కూడా షేర్ ని అందుకోవచ్చు.

ఇది నిజంగానే అద్బుతమైన ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా లేకుంటే టోటల్ వరల్డ్ వైడ్ గా 3.7 కోట్ల రేంజ్ షేర్ ని సినిమా అందుకోవచ్చు. మొత్తం మీద రోజు ని సాలిడ్ గా ముగించనుంది సైరా సినిమా. ఇక అఫీషియల్ గా 12 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment