న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా డే 7 కలెక్షన్స్…ఇదేమి షాక్ సామి!!

మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా హాలిడే ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతుంది, సినిమా 6 వ రోజు తో పోల్చితే 7 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి 5% వరకు గ్రోత్ ని సాధించి దుమ్ము లేపగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా మరింత జోరు గా కలెక్షన్స్ ని సాధిస్తూ ఈ రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది.

సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి ఆల్ మోస్ట్ 15% వరకు గ్రోత్ ఉందని చెప్పొచ్చు, రిలీజ్ అయిన 7 వ రోజు హాలిడే ఉన్నా ఈ రేంజ్ లో ట్రెండ్ ని కంటిన్యు చేస్తుండటం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు….

మొత్తం మీద 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. ఇది టాలీవుడ్ హిస్టరీ లోనే 7 వ రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకున్న సినిమా గా సైరా నరసింహా రెడ్డి నిలవనుంది…

నైజాం లో జోరు బాగున్నా నైజాం ని మించి ఆంద్రా మరియు సీడెడ్ లలో సినిమా దుమ్ము లేపుతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ఆవల సినిమా కర్ణాటక లో మంచి కలెక్షన్స్ ని ఈ రోజు అందుకునేలా కనిపిస్తుండగా మిగిలిన చోట్ల మాత్రం నిరాశ కంటిన్యు అవుతుంది అని చెప్పాలి.

హిందీ లో సినిమా థియేటర్స్ ని చాలా వరకు తగ్గించారు, తమిళ్ లో ధనుష్ అసురన్ వల్ల అక్కడ కేరళలో షోలు మరింత తగ్గాయి. దాంతో అక్కడ భారీ నిరాశని సినిమా మిగిలించనుంది. ఇక ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ తో సినిమా రన్ అవుతుంది, దాంతో 7 వ రోజు వరల్డ్ వైడ్ షేర్ 9 కోట్లు అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు. ఇక అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!