న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా 5వ రోజు కలెక్షన్స్…మాస్ జాతర అంటే ఇదే!!

మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో 87 కోట్లకు పైగా వసూళ్ళని సాధించగా సినిమా నాలుగు రోజుల తర్వాత 5 వ రోజు సూపర్బ్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా సాలిడ్ ట్రెండ్ ని కొనసాగిస్తూ దూసుకు పోతుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 5 వ రోజు అద్బుతంగా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధిస్తుంది. 4 వ రోజు తో పోల్చితే 5 వ రోజు సినిమా…

డ్రాప్స్ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 5% కన్నా తక్కువ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఓవరాల్ గా 10% కి పైగా గ్రోత్ ని సాధించిన సినిమా ఇప్పుడు ఆన్ లైన్ టికెట్ సేల్స్ గ్రోత్ ని బట్టి 5 వ రోజున అవలీలగా 7 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

బతుకమ్మ పండగ వలన ఈవినింగ్ షోలకు నైజాం లో కొంచం ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, అది తప్పితే 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మాస్ జాతరని తలపించేలా సైరా నరసింహా రెడ్డి జోరు కొనసాగుతుండటం తో రోజు ముగిసే సరికి సినిమా 7 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

ఇక సినిమా తెలుగు రాష్ట్రాల తర్వాత ఓవర్సీస్ లో జోరు చూపగా 4 రోజుల తర్వాత అమెరికా కెనడా కలిపి 1.9 మిలియన్ మార్క్ ని అందుకోగా 5 వ రోజు కలెక్షన్స్ తో 2 మిలియన్ మార్క్ ని అధిగమించి దుమ్ము లేపింది. బ్రేక్ ఈవెన్ కి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇక సినిమా

కన్నడలో కూడా జోరు చూపగా హిందీ, తమిళ్ కేరళ ఏరియాల్లో భారీ గా పడిపోయింది. దాంతో అక్కడ ఇప్పటి నుండి చిల్లర కలెక్షన్స్ ఏ వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల లోనే సినిమా ఇప్పుడు ఎక్కువ వసూళ్ళ ని అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు వర్షన్ వరకు సినిమా దుమ్ము లేపే ఓపెనింగ్స్ తో రన్ అవుతుంది, ఇక 5 రోజుల లాంగ్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment