న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా 6 వ రోజు ఓపెనింగ్స్…ఇదేమి కుమ్ముడు సామి!!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుంటూ దూసుకు పోతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులు పూర్తీ అయ్యే సరికి టోటల్ గా 97 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. కాగా సినిమా ఇప్పుడు 6 వ రోజు లో ఎంటర్ అవ్వగా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి హోల్డ్ తో రన్ అవుతుంది.

6 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సినిమా 5 వ రోజు తో పోల్చుకుంటే సుమారు 20 నుండి 25% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల కి వచ్చే సరికి మాత్రం సినిమా మంచి అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది.

దాంతో ఈవినింగ్ అండ్ నైట్ షోల లో సినిమా మంచి గ్రోత్ ని సాధించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది, ప్రస్తుతం ఉన్న డ్రాప్స్ ని బట్టి 6 కోట్ల రేంజ్ కలెక్షన్స్ పక్కా అని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల లో గ్రోత్ బాగుంటే సినిమా లెక్క 6.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది.

ఇది టాలీవుడ్ హిస్టరీ లో 6 వ రోజు కి గాను వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవాలి. అదే విధంగా మిగిలిన ఏరియాల కలెక్షన్స్ చూసుకుంటే మాత్రం సినిమా కర్ణాటక ఓవర్సీస్ తప్పితే మిగిలిన చోట్ల మాత్రం చాలా కష్టంగా కలెక్షన్స్ ని సాధిస్తుంది, దాంతో టోటల్ ప్రెజర్ మొత్తం…

ఇప్పుడు రెండు రాష్ట్రాల మీదే పడుతుంది అని చెప్పాలి. మొత్తం మీద రోజు ముగిసే సరికి సినిమా ఎలాంటి గ్రోత్ ని సాధిస్తుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారగా తర్వాత రెండు రోజులు కూడా హాలిడేస్ కాబట్టి సినిమా జోరు ఇలాగే కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!