న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా 6 వ రోజు కలెక్షన్స్….చరిత్ర చిరిగిపోయింది…కానీ!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 6 వ రోజు లో ఎంటర్ అయ్యింది, సినిమా ఇప్పటికే 97.7 కోట్ల షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించింది, ఇక సినిమా 6 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 5 వ రోజు తో పోల్చితే 20 టు 25% రేంజ్ లో డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.

ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల విషయానికి వచ్చే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి గ్రోత్ ని సాధించింది, దాంతో ఫైనల్ కౌంట్ 6 వ రోజు కి గాను టాలీవుడ్ చరిత్రలో 6 వ రోజు హైయెస్ట్ షేర్ ని అందుకున్న నాన్ బాహుబలి మూవీస్ లో సరికొత్త రికార్డ్ ను నమోదు చేయొచ్చు అంటున్నారు.

సినిమా 6 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడం కన్ఫాం అవ్వగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఫైనల్ కౌంట్ ఎంత వరకు వెళుతుంది అన్నది చెప్పగలం, ఇక్కడ వరకు చరిత్ర కెక్కె కలెక్షన్స్ ని సాధించిన సైరా నరసింహా రెడ్డి మిగిలిన చోట్లకి వచ్చే సరికి మాత్రం…

నిరాశ పరుస్తూ షాక్ ఇస్తుంది, సినిమా హిందీ లో, తమిళ్ లో, కేరళలో ఏమాత్రం గ్రోత్ కనిపించడం లేదు, దాంతో ఆ చోట్ల సినిమాకి భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు, మొత్తం మీద 6 వ రోజు సినిమా వరల్డ్ వైడ్ గా 7 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ లో….

షేర్ ని అందుకునే అవకాశం ఉందని సమాచారం. సినిమా తెలుగు వర్షన్ మాత్రమె 5 రోజుల్లో 90 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోగా ఈ రోజు అన్ని వర్షన్స్ కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ మార్క్ ని సినిమా అందుకుంది, ఇక 6 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment