న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా 9వ రోజు స్టేటస్…ఇది మామూలు షాక్ కాదు!!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి 8 రోజులు పూర్తీ అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ వసూళ్ళనే రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుని సంచలనం సృష్టించింది, సినిమా 90 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి దుమ్ము లేపగా ఇప్పుడు దసరా సెలవులు పూర్తిగా అయిపోయాయి కాబట్టి సైరా నరసింహా రెడ్డి 9 వ రోజు నుండి…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది, కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 8 వ రోజు తో పోల్చుకుంటే మాత్రం 9 వ రోజు డ్రాప్స్ ఏకంగా 50% నుండి 60% వరకు ఉన్నాయని సమాచారం. సినిమా టార్గెట్ పెద్దదిగా ఉండటం తో…

ఈ ఓపెనింగ్స్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చే ఓపెనింగ్స్ అనే చెప్పాలి. అంటే ఆల్ మోస్ట్ 8 వ రోజు వసూళ్ళ లో సగానికి తక్కువ వచ్చే అవకాశం ఉంది, కానీ ఇక్కడ కొంచం అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈవినింగ్ అండ్ నైట్ షోల విషయం లో కొంచం గ్రోత్ కనిపిస్తుంది, అది ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి…

మరింత పెరిగే అవకాశం ఉండటం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఒకవేళ గ్రోత్ ఎక్కువ ఉంటె ఈ లెక్క 3 కోట్ల నుండి 3.5 కోట్ల లోపు కూడా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మిగిలిన చోట్ల సినిమా…స్లో డౌన్ అయింది.

ముఖ్యంగా హిందీ, తమిళ్ కేరళ లో సినిమా థియేటర్స్ కౌంట్ కూడా భారీ గా పడిపోయింది. ఇక కన్నడ లో పర్వాలేదు అనిపించే విధంగా ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన సినిమా స్లో అయింది. ఇక రోజు ముగిసే సరికి సినిమా అన్ని చోట్లా ఎంతవరకు గ్రోత్ ని సాధిస్తుందో చూడాలి…

Leave a Comment