న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా 9 వ రోజు కలెక్షన్స్…దెబ్బ పడినా కొట్టాడు!!

సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్ళతో దుమ్ము లేపిన సినిమా మిగిలిన చోట్ల మాత్రం అంతంతమాత్రం గానే కలెక్షన్స్ ని సాధిస్తుంది. ఇక సినిమా 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 122 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించిన సినిమా 9 వ రోజు నుండి అసలు సిసలు వర్కింగ్ డే…

టెస్ట్ ను ఎదురుకుందని చెప్పొచ్చు. ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగానే పడింది సినిమా పై, మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో 8 వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 50 టు 60% వరకు డ్రాప్స్ ని సినిమా సొంతం చేసుకుంది. ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి…

వచ్చే సరికి తిరిగి గ్రోత్ ని సాధించి షాక్ ఇచ్చే కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా గ్రోత్ ఉండటం తో ఓవరాల్ గా రోజును బాగానే ముగించింది అని చెప్పాలి. సినిమా ఇప్పుడు 9 వ రోజును మొత్తం మీద 3.3 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ లో ముగించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

పూర్తీ ఆఫ్ లైన్ బుకింగ్స్ స్టేటస్ క్లియర్ గా తెలియలేదు కానీ మొత్తం మీద సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే 3.5 కోట్ల రేంజ్ ని దాటే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఇక మిగిలిన చోట్ల కలెక్షన్స్ బిలో యావరేజ్ గానే ఉండగా టోటల్ గా సినిమా 9 వ రోజున వరల్డ్ వైడ్ గా…

సుమారు 3.8 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే ఇది 9వ రోజు అద్బుతమైన కలెక్షన్స్ అనే చెప్పాలి కానీ సినిమా టార్గెట్ ని అందుకోవాలి అంటే మాత్రం ఇవి సరిపోవు అని చెప్పొచ్చు. ఇక 9 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment