న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

సైరా 95.51….రంగస్థలం 95.27…సెన్సేషనల్ రికార్డ్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సైరా నరసింహా రెడ్డి జోరు కొనసాగుతుంది, సినిమా ఇతర భాషల్లో స్లో డౌన్ అయింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తుంది, కానీ ఇతర భాషల ఎఫెక్ట్ వలన రెండు తెలుగు రాష్ట్రాలలో సాధిస్తున్న డీసెంట్ కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో ఎలివేట్ అవ్వడం లేదు. కాగా సినిమా ఈ క్రమం లో ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది.

కాగా ఈ క్రమం లో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసిన రంగస్థలం సినిమా కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రంగస్థలం సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి టోటల్ గా 95.27 కోట్ల షేర్ ని అందుకుంది. దాంతో బాహుబలి సిరీస్ తర్వాత ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు ఈ రికార్డ్ ను సైరా సినిమా బ్రేక్ చేసింది.

అది కూడా 10 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ తో 95.51 కోట్ల షేర్ ని అందుకుని నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను మొత్తం మీద సొంతం చేసుకుంది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకున్న సైరా సినిమా రానున్న ఒకటి రెండు వారాలు తెలుగు సినిమాల నుండి…

పోటి చాలా తక్కువే ఉంది కాబట్టి ఈ వీకెండ్ తో పాటు మిగిలిన రోజుల్లో మినిమం కలెక్షన్స్ తో రన్ అయితే…బాహుబలి మొదటి పార్ట్ నెలకొల్పిన 114 కోట్ల షేర్ రికార్డ్ కి చేరువగా వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్ లో సినిమా ఆ మార్క్ ని అందుకోగలుగుతుందో లేదో చూడాలి.

Leave a Comment