టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

సోలో బ్రతుకే సో బెటర్ టోటల్ కలెక్షన్స్…ఇండియా లో ఫస్ట్ మూవీ…హాట్రిక్!

2020 కరోనా ఎంటర్ అయ్యాక థియేటర్స్ అన్నీ మూత పడగా తర్వాత చాలా గ్యాప్ తర్వాత థియేటర్స్ ని రీ ఓపెన్ చేసినా సినిమాలు మెల్లి మెల్లిగా రిలీజ్ అవుతున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం అందుకున్న సినిమా లేని టైం లో ధైర్యం చేసి తన సినిమాను రిలీజ్ చేశాడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ప్రేక్షకుల ముందుకు క్రిస్టమస్ వీకెండ్ లో…

బరిలోకి దిగిన సాయి ధరం తేజ్ మరీ అద్బుతమైన టాక్ ఏమి సొంతం చేసుకోక పోయినా కానీ పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా అవ్వడం తో జనాలు సినిమాను టాక్ కి అతీతంగా ఆదరించి సూపర్ హిట్ అయ్యేలా చేశారు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలు ఎంటర్ అయ్యే వరకు పరుగును సొంతం చేసుకుని సాలిడ్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుని మంచి లాభాలను దక్కించుకుంది. టోటల్ రన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే…

👉Nizam: 4.28Cr
👉Ceeded: 2.10Cr
👉UA: 1.57Cr
👉East: 95L
👉West: 60L
👉Guntur: 97L
👉Krishna: 69L
👉Nellore: 52L
AP-TG Total:- 11.68CR(19.62Cr+ Gross)
KA+ROI: 55L
Os: 38L
Total WW: 12.61Cr(21.25Cr~ Gross)
ఇదీ సినిమా పరుగు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు. సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 9.2 కోట్ల రేటుకి…

అమ్మగా సినిమా 9.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద 3.01 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది, అలాగే సాయి ధరం తేజ్ కెరీర్ లో హాట్రిక్ గా నిలిచిన ఈ సినిమా దాంతో పాటు పాండమిక్ తర్వాత ఇండియా లో మొట్ట మొదటి క్లీన్ హిట్ మూవీ గా నిలిచింది ఈ సినిమా….

Leave a Comment