గాసిప్స్ న్యూస్

సౌత్ ఇండస్ట్రీ లో టాప్ 5 హైయెస్ట్ బడ్జెట్ మూవీస్ ఇవే!!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలు అంటే మహా అయితే 20 నుండి 25 కోట్ల రేంజ్ లో ఉండేవి, అలాంటి టైం లో మగధీర అనే సినిమా ఏకంగా 45 కోట్ల కి పైగా బడ్జెట్ తో రూపొందింది ఆ బడ్జెట్ ని రికవరీ చేసి మార్కెట్ ని 70 కోట్లకు పెంచింది. అప్పటి నుండి ఇతర ఇండస్ట్రీ లకు పోటిగా మన సినిమా లు కూడా భారీ బడ్జెట్ తో రూపొందటం మొదలు పెట్టాయి.

ఇక తర్వాత టైం లో భారీ బడ్జెట్ తో సినిమాలు మొదలు అయినా మళ్ళీ రేంజ్ పెంచిన సినిమా బాహుబలి సిరీస్… తెలుగు సినిమా బడ్జెట్ కి డబుల్ బడ్జెట్ తో రూపొందిన పార్ట్ 1 రికార్డుల దుమ్ము దులిపి ఇతర ఇండస్ట్రీ లలో మనకు మార్కెట్ ఎక్స్ పాన్షన్ చేసింది.

ఇక రెండో పార్ట్ అయితే ఇతర ఇండస్ట్రీల రికార్డులు తుడిచేసి అక్కడ టాప్ ప్లేస్ లో నిలిచి మన రేంజ్ ని ఎక్కడికో చేర్చింది. దాంతో ఇప్పుడు టాలీవుడ్ సినిమాలు అంటే ఇతర ఇండస్ట్రీ లో కూడా హాట్ టాపిక్ అయింది, మన సినిమాల బడ్జెట్ లు సౌత్ లో బిగ్గెస్ట్ మూవీస్ తో పడుతూ దూసుకు పోతున్నాయి.

సౌత్ ఇండస్ట్రీ లో టాప్ 5 బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన రూపొందుతున్న సినిమాలను ఒక సారి గమనిస్తే..
#2Point0 – 550Cr
#Baahubali Series- 450 Cr
#RRR – 400 Cr
#Saaho – 350 Cr
#SyeRaaNarasimhaReddy – 270Cr మొత్తం మీద టాప్ 5 బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా లు ఇవి.

ఈ లిస్టులో టాప్ ప్లేస్ పక్కకు పెడితే మిగిలిన నాలుగు సినిమాలు అందులో ఒక సిరీస్ మొత్తం మన టాలీవుడ్ నుండి రావడం ఈ మధ్య కాలం లో బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ అని చెప్పాలి. ఇక ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ అన్నీ కూడా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. అవన్నీ ఇంకా పూర్తీ అవ్వాలి కాబట్టి ఈ లిస్టు లో చేర్చడం లేదు. ఇక ఫ్యూచర్ లో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు ఉండటం ఖాయం…

Leave a Comment