న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

సౌత్ నుండి హిందీ లో డబ్ అయిన మూవీస్ లో టాప్ 10 కలెక్షన్స్ మూవీస్ ఇవే!

ఇండియా లోబాలీవుడ్ ఇండస్ట్రీ మిగిలిన అన్ని ఇండస్ట్రీల కన్నా ఎక్కువ మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ…. సౌత్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత భారీ హిట్స్ అయినా అవి ఆ రాష్ట్రాలకు మాత్రమె పరిమితం అవుతాయి కానీ… బాలీవుడ్ మూవీస్ మాత్రం టోటల్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి తమ రేంజ్ ఏంటో చూపుతాయి. ఇండియా వైడ్ గా హిందీ మాట్లాడే వారే ఎక్కువ కాబట్టి వారి రీచ్ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాంటి బాలీవుడ్ లో పాగా వేయాలని సౌత్ వాళ్ళు ఎప్పటి నుండో ట్రై చేశారు.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే….20 – 25 ఏళ్ల క్రితమే సౌత్ సినిమాలు అక్కడ డబ్ అయ్యి రిలీజ్ అయ్యాయి, బాంబే, భారతీయుడు లాంటి సినిమాలు అక్కడ డబ్ అయ్యి పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించినా తర్వాత మాత్రం పెద్దగా వర్కౌట్ అయిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. రజినీ సినిమాలు తప్ప మిగిలిన సౌత్ మూవీస్ ఏవి కూడా పెద్దగా డబ్ కాలేదు..

కానీ అలాంటి సమయం లో బాహుబలి పార్ట్ 1 అక్కడ మొట్టమొదటి సారి 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సౌత్ సినిమా గా నిలిచి సంచలనం సృష్టించగా తర్వాత వచ్చిన బాహుబలి 2 ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఆల్ టైం నంబర్ 1 గా ఇప్పటికి కొనసాగుతుంది. మూడేళ్ళు అవుతున్నా ఇప్పటికీ బాలీవుడ్ నంబర్ 1 మూవీ బాహుబలే….

దాంతో ఇప్పుడు సౌత్ సినిమాల మార్కెట్ హిందీ లో బాగానే ఎక్స్ పాన్షన్ జరిగింది, రీసెంట్ గా సాహో ఫ్లాఫ్ టాక్ తో కూడా 150 కోట్ల రేంజ్ లో వసూళ్లు రాబట్టింది అక్కడ… ఇప్పటి వరకు అక్కడ రిలీజ్ అయిన సౌత్ మూవీస్ లో టాప్ 10 నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సౌత్ మూవీస్ ని గమనిస్తే…

1. #Baahubali2: 510C
2. #2Point0: 189C
3. #Saaho: 150.6C
4. #Baahubali: 115C
5. #KGF: 45C
6. #Kabali: 28C
7. #Robot: 22c
8. #TheGhaziAttack: 19.90Cr~
9. #Vishwaroopam: 13.5c
10. #Indian: 12c
11. #I – 11.5cr
12. #Bombay – 10cr
13. #Kaala: 10C
14. #SyeRaa: 9.85C
ఇవీ అక్కడ మొత్తం మీద హైయెస్ట్ వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్

కరోనా వలన లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ ఎఫెక్ట్ పడినా కానీ ఓ రేంజ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి రాధే శ్యామ్, KGF 2, ఆర్ ఆర్ ఆర్, పుష్ప ఇలా చెప్పుకుంటూ పొతే పాన్ ఇండియా మూవీస్ చాలా ఉన్నాయి. మరి వాటిలో ఈ లిస్టులో నిలిచి దుమ్ము లేపే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి మరి…

Leave a Comment