గాసిప్స్ న్యూస్

స్టార్ హీరో సినిమా రిలీజ్ ను ఆపేయాలి అంటూ గొడవ…ఏం జరుగుతుందో మరి!!

సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ లో ఉంటున్న టైం లో ఇప్పుడు దాదాపు అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ కూడా పోస్ట్ పోన్ లు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే టైం లో జనాలు థియేటర్స్ కి వచ్చేలా లేక పోవడం తో చాలా వరకు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ తోనే ఆడియన్స్ ముందుకు రావడానికి మళ్ళీ సిద్ధం అవుతూ వస్తున్నారు.

ఇలాంటి టైం లో ఎప్పుడైనా సరే థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అనుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే మాత్రం అందరికీ షాకిస్తూ థియేటర్స్ లో అలాగే డిజిటల్ లో ఒకే రోజు రిలీజ్ కి సిద్ధమై అనౌన్స్ మెంట్ చేసిన విషయం తెలిసిందే.

పే పెర్ వ్యూ పద్దతిలో డిజిటల్ లో అలాగే థియేటర్స్ తెరచి ఉన్న చోట థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందని చెప్పగా ఈ విషయం పై బాలీవుడ్ థియేటర్ ఓనర్స్ మండి పడుతున్నారు. అసలే ఇప్పుడు సెకెండ్ వేవ్ పీక్ స్టేజ్ లో ఉన్న టైం లో జనాలు థియేటర్స్ రావడానికి…

బయపడుతూ ఉంటే ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ ఏంటని గొడవ పెడుతున్నారు. పరిస్థితులు చక్కదిద్దుకుంటే థియేటర్స్ లో రిలీజ్ చేస్తే ఏడాది నుండి మూతబడి సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్న అనేక సింగిల్ స్క్రీన్స్ కి ఊపిరి పోయాల్సిన సినిమాను ఇలా ఈ పరిస్థితులలో ఇలా రిలీజ్ చేయడం ఏంటి అంటూ గొడవ చేస్తున్నారు. సినిమా రిలీజ్ ను ఎలాగైనా ఆపాలని…

పరిస్థితులు సద్దుకున్నాక థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పట్లో అన్నీ ఓకే అయ్యేలా కనిపించక పోవడం తో నిర్మాతలు ఇక డిజిటల్ రిలీజ్ వైపే మొగ్గు చూపుతున్నారట. అలా అయితే సల్మాన్ సినిమాలను బ్యాన్ చేస్తామంటూ థియేటర్ ఓనర్స్ చెబుతున్నారట. మరి ఇక మేకర్స్ ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇక..

Leave a Comment