న్యూస్ బాక్స్ ఆఫీస్

స్టైలిష్ స్టార్ ఊచకోత…ఫస్ట్ డే తక్కువ థియేటర్స్ తో రికార్డ్ కలెక్షన్స్!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాల ను మించి వసూళ్ళని సాధించి ఊచకోత కోసింది, సినిమా 19 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందు కుంటుంది అను కోగా ఏకంగా హైర్స్ హెల్ప్ తో 25 కోట్ల మార్క్ ని అధిగ మించి సంచలనం సృష్టించింది.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 6.39 కోట్ల హైర్స్ ని సొంతం చేసుకోగా టోటల్ ఫస్ట్ డే షేర్ 25.93 కోట్ల మార్క్ ని అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కేరళలో లెక్కలు క్లియర్ గా తేలాల్సి ఉండగా… కర్ణాటక లో హైర్స్ కలపాల్సి ఉంది. వాటితో కలిపి…లెక్క మరింత మించుతుంది.

ఇక మొదటి రోజు సినిమా కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 6.01Cr
?Ceeded: 4.02Cr(82L Hires)
?UA: 2.87Cr
?East: 2.98Cr(Inc. 1.21Cr Hires,SGs,MGs)
?West: 2.78Cr(Inc. 1.82Cr Hires,SGs,MGs)
?Guntur: 3.41Cr(Inc. 1.56Cr Hires,SGs,MGs)
?Krishna: 2.57Cr(Inc. 68L Hires,SGs,MGs)
?Nellore: 1.29Cr(30L Hires)
AP-TG Total:- 25.93CR?(6.39Cr Hires)
Ka: 3.32Cr(2.07Cr Hires)
ROI: 1.25Cr
OS: 6.33Cr
Total: 36.83Cr(55Cr~ Gross)

కాగా కర్ణాటక లో హైర్స్ ఎంత అనేది క్లియర్ గా తెలియలేదు కానీ ఆ లెక్క తెలిస్తే ఓవరాల్ ఫస్ట్ డే కలెక్షన్స్ కౌంట్ 36 కోట్లకు పైగా వెళ్ళడం ఖాయం. మొత్తం మీద కేవలం వరల్డ్ వైడ్ గా 1100 థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం అనే చెప్పాలి.

మొత్తం మీద అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఇప్పుడు మిగిలిన రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.

Leave a Comment