న్యూస్ బాక్స్ ఆఫీస్

హాట్రిక్ డిసాస్టర్లు…అయినా రాయలసీమలో బాలయ్య #BB3 ఊచకోత!

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన సినిమాలే,ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ తర్వాత చేసిన రూలర్ సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరచగా మరో పక్క డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేసిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు, సరైనోడు తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బోయపాటి మూవీ…

ఇంకా క్లీన్ హిట్ ని అందుకోవాల్సి ఉండగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ పవర్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. సింహా లెజెండ్ లాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకున్న వీరి కాంబినేషన్ పై క్రేజ్ మరో లెవల్ లో ఉండగా…

ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న హాట్రిక్ మూవీ BB3 కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు, మే నెల ఎండ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా ఇప్పటి నుండే సంచలనాలను సృష్టిస్తూ ఇద్దరూ ఫ్లాఫ్స్ లో ఉన్నారు అన్నది కూడా మర్చిపోయే రేంజ్ లో బిజినెస్ ను సాధిస్తుంది.

రీసెంట్ గా సినిమా నైజాం మరియు వైజాగ్ ఏరియాల బిజినెస్ మొత్తం మీద 20 కోట్ల రేటు సొంతం చేసుకోగా ఇప్పుడు బాలయ్య కి సెన్సేషనల్ క్రేజ్ ఉండే రాయలసీమ ఏరియాలో ఈ సినిమా అల్టిమేట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఏకంగా 12.06 కోట్ల రేటు ని సొంతం చేసుకుని ఈ సినిమా అక్కడ సాలిడ్ ఊచకోత కోసింది…

ఈ రేంజ్ లో బిజినెస్ ను అక్కడ సొంతం చేసుకోవడం అంటే సినిమా అక్కడ భారీ కలెక్షన్స్ తో సంచలనాలను సృష్టించాలి, అది కూడా పోటి లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో ఇటు బాలయ్య కి అటు బోయపాటి కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ మూవీ గా నిలుస్తుందా లేదా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు…

Leave a Comment